Wednesday, February 24, 2021

Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2020-21



Read also:

Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2020-21

Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2022-21. Whether to Show One DA or Two DAs in Income Tax form 16 Analysis. Which benefits us. Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2020-21

Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2020-21

Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2020-21

Detailed Clarification on DAs in Income Tax for 2020-21 FY - How Many DAs to Show in IT 2020-21

ప్రస్తుత ఇన్కమ్ టాక్స్ లో ఒక  డి ఏ చూపించాలా లేక రెండు డి ఏ లు చూపించాలా అని సందేహాలు ఉన్న నేపథ్యంలో ఎన్ని డి ఏ లు చూపిస్తే మనకి లాభదాయమో వివరణ:

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మనకి మర్చి నెల వరకు రెండు డి ఏ లు చెల్లించవలసి ఉన్నది. అయితే మొదటి డి ఏ కూడా ఇంకా మన అకౌంట్ లలో చెల్లించబడలేదు. ఫిబ్రవరి నెలలో క్లెయిమ్ పెట్టిన మొదటి డి ఏ ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇటువంటి సందర్భములో మర్చి నెలలో క్లెయిమ్ పెట్టాల్సిన రెండో డి ఏ ఎప్పటికి మన చేతికి వస్తుందో తెలియని పరిస్థితి. ఇది ఏపీటీచెర్స్ వెబ్సైటు వారి ద్వారా మీకు అందించబడుతుంది.  మరి ఇటువంటి సందర్భంలో మన ఇన్కమ్ టాక్స్ లో ఎన్ని డి ఏ లు చూపించాలి అన్న దాని పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా సూచిస్తున్నారు. 

ఒక వాదన: 

మొదటి డి ఏ ఇంకా మన అకౌంట్ లో పడలేదు కాబట్టి రెండో డి ఏ ఇంకా క్లెయిమ్ చేయలేదు కాబట్టి మనం రెండో డి ఏ మన ఇన్కమ్ టాక్స్ లో చూపించవలసిన అవసరం లేదు. పైగా రెండో డి ఏ చూపిస్తే ఇప్పుడు మనకి ఎక్కువ టాక్స్ పడే అవకాశం ఉంది కాబట్టి ఒక డి ఏ చూపిస్తే సరిపోతుంది. 

రెండో వాదన: 
మొదటి డి ఏ మన అకౌంట్ లో పాడకపోయినా, మార్చి లోపల మన రెండో డి ఏ కూడా క్లెయిమ్ పెడతారు కాబట్టి ఆ డి ఏ కూడా మన ఇన్కమ్ టాక్స్ లో చూపించాలి. 

వివరణ: 
ఇప్పటికే అందరు మొదటి డి ఏ ను క్లెయిమ్ చేయడం జరిగింది. అది ఇంకా మన అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు. మార్చి నెలలో రెండో డి ఏ క్లెయిమ్ చేయడానికి ట్రెజరీ వెబ్సైటు ఆప్షన్ కూడా చేర్చబడింది. కాబట్టి మర్చి మొదటి వారంలో రెండో డి ఏ క్లెయిమ్ పెడతారు. 

ఆదాయపన్ను నిబంధనల ప్రకారం మార్చి 31 లోపల వచ్చే మొత్తం ఆదాయాన్ని లెక్కించి DDO  లు తమ పరిధిలో ఉన్న ఉద్యోగులనుండి ఆదాయపన్ను ను TDS  రూపంలో మినహాయించవలసి ఉంటుంది. అది DDO ల బాధ్యత. ఒకవేళ మన ఆదాయపన్ను కన్నా ఎక్కువ టీడీస్  మినహాయించబడినట్లు అయితే ఈ-ఫైలింగ్ చేసిన తరువాత అది తిరిగి మనకు చెల్లించబడుతుంది.

కాబట్టి రెండో డి ఏ ను కూడా ఇన్కమ్ టాక్స్ లో చూపించడం సబబు. ఒకవేళ మార్చి నెలలో రెండో డి ఏ క్లెయిమ్ పెట్టె ఉద్దేశం లేనప్పుడు ఒక డి ఏ ను ఇన్కమ్ టాక్స్ లో చూపించినా సరిపోతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా రెండో డి ఏ ను ఇన్కమ్ టాక్స్ లో చూపించవలసి ఉంటుంది.

దానితో పాటు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇంకా బకాయి ఉన్న 2019 జనవరి డి ఏ మూడు విడతలు మరియు 2019 జులై రెండు విడతలు కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మన ఖాతాలో జమ అవుతాయి. ఇప్పుడు ఒక డి ఏ కోసం ఆలోచించి టాక్స్ పెరుగుతుంది అని దానిని మన ఇన్కమ్ టాక్స్ నుండి మినహాయిస్తే, ఈ డి ఏ కూడా రాబోయే 2019 జనవరి మరియు 2019 జులై రెండు విడతల డి ఏ లతో కలిసి ఇంకా ఇంకా ఎక్కువ టాక్స్ పడుతుంది. కాబట్టి మొత్తం విషయాలను పరిగణనలో తీసుకొని ఎన్ని డి ఏ లు ఈ ఇన్కమ్ టాక్స్ లో చూపించాలో నిర్ణయం తీసుకోగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :