Wednesday, February 17, 2021

Check the online status of Indane Gas



Read also:

Subsidy on LPG gas cylinder: కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలకు ఊరట కల్పించేందుకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ సౌకర్యం అందిస్తోంది. కానీ చాలా రాష్ట్రాల్లో ఈ సబ్సిడీ సరిగా ఇవ్వట్లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. అదే సమయంలో.వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైగా ఉన్నవారిని సబ్సిడీ లబ్దిదారుల జాబితా నుంచి కేంద్రం తొలగించింది. మరి ఫిబ్రవరి నెలలో మీరు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ పొందగలరా.పొందితే ఎంత పొందగలరు వంటి వివరాలు మీకు తెలియాల్సి ఉంటుంది. దాన్ని ఎవరూ మీకు చెప్పాల్సిన పనిలేదు. మీ అంతట మీరే తెలుసుకోవచ్చు. అందుకు ఇలా చెయ్యాలి.

Check the online status of Indane Gas in this way:

- ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే సబ్సిడీ గ్యాస్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఇండేన్ గ్యాస్ వెబ్‌సైట్ https://bit.ly/3rU6Lol లోకి వెళ్లాల్సి ఉంటుంది.

- వెబ్‌సైట్‌లో మీకు ఓ సిలిండర్ ఫొటో కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చెయ్యాలి. మీకు ఓ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు సబ్సిడీ స్టేటస్ (Subsidy Status) అని ఇంగ్లీషులో రాసి.ప్రొసీడ్ బటన్ నొక్కాలి.

- ఇప్పుడు సబ్సిడీకి సంబంధించిన (PAHAL) బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీకు సబ్సిడీ కేటగిరీ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు సబ్సిడీ నాట్ రిసీవ్డ్ (Subsidy Not Received) ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.

- ఆ తర్వాత మీరు మీ మొబైల్ నంబర్ (ఇండేన్ గ్యాస్ వారి దగ్గర రిజిస్టర్ అయిన నంబర్) ఎంటర్ చెయ్యాలి.

- మీరు మొబైల్ నంబర్ లింక్ చెయ్యకపోతే... అలాంటప్పుడు మీకు ID ఆప్షన్ ఉంటుంది. మీ గ్యాస్ కనెక్షన్ ఐడీ నంబర్ మీరు ఎంటర్ చెయ్యవచ్చు.

- ఆ తర్వాత మీరు మొత్తం వెరిఫై చేసి సబ్‌మిట్ (submit) క్లిక్ చెయ్యాలి. వెంటనే మీకు పూర్తి వివరాలు వస్తాయి.

ఇప్పుడు మీకు సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేసినట్లే. ఎంత సబ్సిడీ పొందగలరు, ఎంత సబ్సిడీ మీకు వచ్చింది అనేది మీకు తెలిసిపోతుంది. అంతేకాదు.మీరు కస్టమర్ కేర్‌ ప్రతినిధితో మాట్లాడి కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇండేన్ గ్యాస్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ ఇదే 1800-233-3555. ఇక్కడ కూడా మీతో మాట్లాడే ప్రతినిధి మొబైల్ నంబర్ లేదా గ్యాస్ సర్వీస్ ID అడుగుతారు. ఆ వివరాలు చెబితే మీరు కోరిన వివరాలు ఇస్తారు.

మీరు గమనించే ఉంటారు ఫిబ్రవరిలో గ్యాస్ సిలిండర్ ధర రెండుసార్లు పెరిగింది. మొదట ఫిబ్రవరి 4న.ఇండేన్, HP కంపెనీలు.సబ్సిడీయేతర LPG సిలిండర్లపై ధరను రూ.25 పెంచాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 15న ఏకంగా రూ.50 పెంచాయి. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నా.కంపెనీలు పట్టించుకోవట్లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :