More ...

Sunday, February 14, 2021

Best Saving SchemesRead also:

Best Money Saving Schemes

రిస్క్ లేకుండా భవిష్యత్తులో అవసరాలు తీరేందుకు డబ్బు దాచుకోవడం ప్రధానం. అలాంటి పోస్టాఫీస్, LIC సేవింగ్స్ స్కీములను తెలుసుకుందాం.

Best Saving Schemes: ప్రపంచం చాలా మారింది. భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అందుకోసం ఎన్నో మార్గాలున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఇలా ఎన్నో ఉన్నా. రిస్క్ లేకుండా. ఎక్కువ మొత్తం రిటర్న్ వచ్చే పథకాలు అందరికీ నచ్చుతాయి. ముఖ్యంగా మనతోపాటూ. మన ఫ్యామిలీ సభ్యుల భవిష్యత్తుకి కూడా మనం భరోసా ఇచ్చేందుకు పోస్టాఫీస్, LIC పథకాలు సరైన ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనం నిశ్చింతగా ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ల లాగా ఈ స్కీముల్లో రిస్క్ ఉండకపోవడం కలిసొచ్చే అంశం.

ప్రస్తుతం పోస్టాఫీసులో 9 రకాల సేవింగ్ స్కీములు ఉన్నాయి. వాటికి వడ్డీ రేటు సంవత్సరానికి 7.6 దాకా ఉంటోంది. అదే సమయంలో LIC కూడా చాలా సేవింగ్ స్కీములు తెచ్చింది. అవేంటో చూద్దాం. వాటిని మీరు ఎలా ప్రారంభించవచ్చో తెలుసుకుందాం.

పోస్టాఫీసులో SSC, PPF, KVP, NSC, MIS, సుకన్య సమృద్ధి అకౌంట్లు తెరచుకోవచ్చు. ఇవన్నీ సేవింగ్స్ టైపు అకౌంట్లు. వీటిలో మీరు కచ్చితమైన గడువు ప్రకారం కొంత మొత్తాన్ని జమ చేస్తూ ఉండాలి. చాలా మంది నెలవారీ పొదుపు చేస్తుంటారు.

Women Income Scheme (MIS):

మహిళా ఆదాయ పథకం (MIS) అనేది కేంద్ర సమాచార శాఖ పథకం. దీన్నే పోస్టాఫీస్ మహిళా యోజన పథకం అని కూడా అంటున్నారు. మీరు డబ్బు పొదుపు చేస్తూనే. నెలవారీ ఖర్చులకు కొంత మనీ కావాలనుకుంటే. మీరు ఈ మహిళా యోజన స్కీములో చేరొచ్చు. దీని కింద మీకు సంవత్సరానికి 7.8 శాతం వడ్డీ వస్తుంది. మీరు ఈ స్కీమును తక్కువలో తక్కువ రూ.1000తో ప్రారంభించవచ్చు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే. ఎక్కువ వడ్డీ రేటు ఉండటం దీని ప్రత్యేకత.

Senior Citizens Savings Scheme (SCSS):

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది 5 ఏళ్లపాటూ ఉండే స్కీమ్. దీనికి ఏడాదికి 7.4 శాతం వడ్డీ వస్తుంది. కనీసం రూ.1000తో ఈ పథకం ప్రారంభించుకోవచ్చు. మాగ్జిమం రూ.15 లక్షల దాకా ఈ స్కీములో దాచుకోవచ్చు. ఈ అకౌంట్ తెరిచేవారి వయసు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

5 year Recording Deposit (RD):

మీరు పోస్టాఫీసులో ఓ రికరింగ్ డిపాజిట్ తెరవవచ్చు. ఇందుకు కనీసం నెలకు రూ.100 మాత్రమే జమ చేయవచ్చు. దీని కాలపరిమితి ఐదేళ్లు. ప్రస్తుతం దీనికి ఏడాదికి 5.6 శాతం వడ్డీ ఇస్తున్నారు. దీన్ని జాయింట్ అకౌంట్‌లా కూడా తెరచుకోవచ్చు. పిల్లలుంటే 10 ఏళ్లు దాటిన వాళ్లు దీన్లో భాగం కావచ్చు. ప్రతి నెలా 15 వ తేదీ ముందు దీన్ని తెరచుకోవచ్చు. అందువల్ల ప్రతి నెలా 15వ తేదీకి ముందే మీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

Post Office Time Deposit (TD):

పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ అనేది 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకూ తెరవవచ్చు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు. పరిమితి లేదు. కనీసం రూ.1000తో ప్రారంభించుకోవచ్చు. దీనికి వడ్డీ రేటు ఏడాదికి 5.5 శాతం నుంచి 7.8 శాతం దాకా ఉంటుంది.

EPIN అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తెచ్చిన పాపులర్ స్కీమ్. దీన్లో రకరకాల పెట్టుబడులు, రకరకాల ఇన్సూరెన్సులూ ఉన్నాయి.

LIC's new insurance plan:

LICలో మరో ప్లాన్ ఉంది. అందులో మీరు డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఓ సింగిల్ ప్రీమియంను మీరు ప్రత్యేక గడువులో రిఫండ్ తీసుకోవచ్చు. అందుకు కొంత లాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎందుకంటే ఎప్పుడైనా డబ్బు అవసరమైతే ఆదుకునేలా దీన్ని తెచ్చారు. ఈ స్కీమ్ కాలపరిమితి 9, 12, 15 ఏళ్ల దాకా కూడా ఉంది. స్కీమ్ ముగిసే కంటే 5 ఏళ్ల ముందే ఇన్వెస్టర్ చనిపోతే. డిపాజిట్ మొత్తం వెనక్కి ఇస్తారు. అదే. పాలసీ తెరిచిన తర్వాత ఐదేళ్లలోపు ఇన్వెస్టర్ చనిపోతే. డిపాజిట్‌తో పాటూ అదనపు ఫండ్స్ కూడా కలిపి ఇస్తారు. ఇందులో పాల్గొనేవారి వయసు 15 ఏళ్లు దాటి ఉండాలి. మాగ్జిమం వయసు 50 ఏళ్లు.

New Jeevan Shanti Deferred Annuity Plan:

LIC తెచ్చిన న్యూ జీవన్ శాంతి డిఫెర్డ్ యాన్యుటీ ప్లాన్. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్‌కి సంబంధించినది. ఈ స్కీమ్ వడ్డీ ఎంత అనేది. ప్లాన్ ప్రారంభంలోనే చెబుతారు. దీనికి నెలవారీ లేదా 3 నెలలు లేదా 6 నెలలు లేదా సంవత్సరానికి ఓసారి డబ్బు చెల్లించవచ్చు. ఈ స్కీమ్‌లో ఏడాదికి కనీసం రూ.12,000 చెల్లించాల్సి ఉంటుంది.

LIC New Children's Money Back Plan -

పిల్లల భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని LIC. చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ తెచ్చింది. ఈ ఇన్సూరెన్స్ అనేది 0 నుంచి 12 ఏళ్ల పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కనీసం రూ.10,000 ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ 25 ఏళ్ల వరకూ వర్తిస్తుంది. దీని కింద LIC. డిపాజిట్‌పై 20 శాతం దాకా చెల్లిస్తుంది. 18 ఏళ్లు, 20 ఏళ్లు, 22 ఏళ్లు కింద చెల్లిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :