Monday, February 15, 2021

AP Municipal Elections: ఏపీలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇవే



Read also:

AP Municipal Elections: ఏపీలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నగారా మోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఉదయం 8గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయడంతో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల హడావిడి నెలకొంది. ఐతే రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లోనే ఎన్నికలు జరగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కార్పరేషన్, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికల జాబితాలో లేవు. అలాగే కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగడం లేదు. గ్రామాల విలీన వివాదాల కారణంగా కొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు.ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఇప్పటికే పార్టీలు ప్రచార రంగంలోకి దిగాయి.

ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే

శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ
విజయనగరం జిల్లా: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల,
విశాఖపట్నం జిల్లా: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి
తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, యేలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం,
పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం,
కృష్ణాజిల్లా: విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు, నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు
గుంటూరు జిల్లా: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, చీరాల,
ప్రకాశం జిల్లా: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు,
నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట,
అనంతపురం జిల్లా: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, హిందూపూర్, గుంతకల్లు, తాడిపజ్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర
కర్నూలు జిల్లా: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, గూడురు, ఆళ్లగళ్ల, ఆత్మకూరు,
కడప జిల్లా: కడప మున్సిపల్ కార్పొరేషన్, ప్రొద్దటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదకూరు, యర్రగుంట్ల
చిత్తూరు జిల్లా: తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు
షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాలు, పార్టీల పోస్టర్లు, విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందిగా ఎస్ఈసీ ఆదేశించింది. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇవాళ్టి నుంచి మార్చి 15 వరకు కోడ్ అమల్లో ఉండనుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :