Friday, February 26, 2021

AP Grama/ward Volunteers సత్కారం



Read also:

AP Grama/ward Volunteers:  జగనన్న తోడు, వైయస్​ఆర్ ఆసరా, చేయూత, ఉపాధి హామీ  వాలంటీర్లకు సత్కారం,  అంశాలపై సీఎం జగన్‌ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు.

AP Grama/ward Volunteers:  జగనన్న తోడు, వైయస్​ఆర్ ఆసరా, చేయూత, ఉపాధి హామీ  వాలంటీర్లకు సత్కారం,  అంశాలపై సీఎం జగన్‌ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. అర్హతలు ప్రకారం మూడు కేటగిరీలకు వాలంటీర్లను ఎంపిక చేయాలని ఫిక్సయ్యారు. లెవల్‌ 1 లో ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన చేయాలన్నారు. లెవల్‌ 2లో ప్రతి మండలంలో, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున, లెవల్‌ 3లో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లకు సత్కారాలు చేయాలని నిర్ణయించారు. ఏడాదిపైగా సేవలు అందించిన వారికి సేవామిత్రతో పాటు బ్యాడ్జీ, రూ.10 వేలు నగదు పురస్కారం అందించనున్నారు. లెవల్‌–2 వారికి సేవారత్నతో పాటు, స్పెషల్‌ బ్యాడ్జ్, రూ.20వేలు అందిస్తారు. లెవల్‌ –3 వారికి సేవా వజ్రాల పేరిట స్పెషల్‌ బ్యాడ్జ్‌ తో పాటు మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారాలు అందిస్తారు. పురస్కారాల ఎంపికకు అర్హతలను అధికారులు నిర్దేశించారు. పక్షపాతం చూపకుండా, అవినీతి చేయకుండా సేవా దృక్పథాన్ని పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

యాప్‌ల వినియోగం, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కొవిడ్‌ -19 సర్వే తదితర అంశాలను పురస్కారాల ఎంపికకు ప్రామాణికంగా తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో మూడుచోట్ల కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరవుతారు.

ఇక ఉపాధి హామీ, వైయస్​ఆర్ ఆసరా, చేయూత, జగనన్న తోడు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి  సమీక్ష జరిపారు. ఆసరా, చేయూతల కింద 66,702 రిటైల్‌ షాపులు పెట్టుకునేందుకు ఆప్షన్‌ ఇచ్చినట్లు అధికారులు జగన్‌కు వివరించారు.  ఇప్పటికే 98 శాతం మంది షాపులు ఏర్పాటు చేసుకున్నారని, ప్రఖ్యాత సంస్థల పార్టనర్షిప్‌తో ఈ ఉపాధి మార్గాలను కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. రిటైల్‌ షాపులు కాకుండా చిరు వ్యాపారాలు, టెక్స్‌టైల్స్, హాండీక్రాఫ్ట్స్, ఫుడ్‌ ప్రొడక్ట్స్, జ్యుయలరీ, కెమికల్‌ తదితర వ్యాపారాలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారు దాదాపు 16.25 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా ఆప్షన్ పెట్టుకున్న వారికి తోడుగా నిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు కదలాలని చెప్పారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :