Saturday, February 20, 2021

Amazon Fab Phones Fest



Read also:

Amazon Fab Phones Fest | అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? ధర ఎక్కువైనా సరే మంచి స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్. ఫిబ్రవరి 22న అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.42,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్‌లో రూ.6,000 డిస్కౌంట్‌కే కొనొచ్చు. అంటే రూ.36,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ ఫిబ్రవరి 25న ముగుస్తుంది.

వన్‌ప్లస్ 8టీ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే, 48మెగాపిక్సెల్ IMX586 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రీడింగ్ మోడ్, నైట్ మోడ్, వైబ్రంట్ కలర్, ఫేస్ అన్‌లాక్, హెచ్‌డీఆర్, స్క్రీన్ ఫ్లాష్, ఫేస్ రీటచింగ్, అలెక్సా హ్యాండ్స్ ఫ్రీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

వన్‌ప్లస్ 8టీ స్పెసిఫికేషన్స్

  • డిస్‌ప్లే: 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌
  • ర్యామ్: 8జీబీ, 12జీబీ
  • ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
  • ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
  • రియర్ కెమెరా: 48మెగాపిక్సెల్ IMX586 ప్రైమరీ సెన్సార్ + 16మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్
  • ఫ్రంట్ కెమెరా: 16మెగాపిక్సెల్ IMX471 సెన్సార్
  • బ్యాటరీ: 4,500ఎంఏహెచ్ (65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
  • ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఓఎస్ 11
  • సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
  • 8జీబీ+128జీబీ- రూ.42,999
  • 12జీబీ+256జీబీ- రూ.45,999

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్‌లో ఇతర స్మార్ట్‌పోన్లపైనా ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్‌లో వన్‌ప్లస్ 8 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా రూ.4,000 డిస్కౌంట్‌కు లభిస్తుంది.

Read Also:

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :