Monday, February 15, 2021

Again LPG Cylinder Price



Read also:

LPG Cylinder Price: ప్రజలకు మరో బిగ్ షాక్ భారీగా పెరిగిన సిలిండర్ ధర  సామాన్య ప్రజలకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. దీనికి తోడు సిలిండర్ రేటు కూడా భగ్గమంటోంది. తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. రేపటి నుంచి సిలిండర్‌ బుక్ చేసే వారిపై అదనపు భారం పడబోతోంది.

ఎల్పీజీ (14.2 కేజీల డొమెస్టిక్) సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలలు ఏకంగా 50 రూపాయలు పెంచాయి. ఈ కొత్త ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. 

హైదరాబాద్‌లో సిలిండర్ ధర ప్రస్తుతం ధర రూ.771.50గా ఉంది. రేపటి నుంచి రూ. 821.50 చెల్లించాలి. ఒకప్పుడు 600లకు వచ్చే సిలిండర్ ధర ఇప్పుడు రూ.800 దాటటంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఢిల్లీలో సిలిండర్ ధర రూ.769కి చేరింది. బెంగళూరులో రూ.772, చెన్నైలో రూ.785, ముంబైలో రూ.769, రూ.కోల్‌కతాలో 795కి చేరింది. 

ఇక సిలిండర్ ధరలతో పాటు వాహనాల ఇంధన ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 వైపు పరుగులు పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :