Friday, January 1, 2021

Weight Loss



Read also:

ఖాళీ కడుపుతో ఈ 5 ఫుడ్స్ అస్సలు తినకండి తింటే అంతే

ఉదయం అల్పాహారంలో మనం తీసుకునే ఆహారం ఎంతో కీలకమైంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి అది అత్యంత ఆవశ్యకం కూడా. ఎన్ని డైట్లు పాటించినా.ఉదయం పూట టిఫిన్ చేయాల్సిందేనని వైద్య, డైటిషియన్ నిపుణులు చెబుతున్నారు. మరయితే.. తినమన్నారు కదా అని ఏది పడితే అది తినొద్దు. అలా తింటే మొదటికే మోసం.

బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగని ఏది పడితే అది తినకూడదు. ఒక క్రమ పద్దతిలో సరైన ఆహారం తీసుకుంటే మనం కోరుకున్న శరీరాకృతి మన సొంతమవుతుంది. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఐదు ఫుడ్స్ మాత్రం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.

సాఫ్ట్ డ్రింక్స్.ఉదయమే కాదు.రోజులో ఎప్పుడు కూడా వీటిని తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు వైద్యులు. ఇందులో ఉండే co2 అధికంగా ఉంటుంది. అంతేగాక చక్కెర శాతం కూడా అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు సాఫ్ట్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

సిట్రస్ పండ్లు.. సిట్రస్ పండ్లంటే పులుపుతో కూడుకున్నవి. ఉదాహరణకు నిమ్మ, నారింజ, ద్రాక్ష, బత్తాయి వంటివి. ఇందులో ఉండే అధిక ఆమ్లాలు.కడుపుపై అదనపు భారాన్ని మోపుతాయట.

కూల్ డ్రింక్స్.పొద్దున లేవగానే అందరూ చల్లటి నీళ్లు తాగాలని ఉబలాటపడతారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీటిని తీసుకోవాలి. నిమ్మరసం, అల్లంలో వేడి నీటిని కలుపుకుని తాగితే అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందే తప్ప కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కాదు. శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కారంగా ఉండే ఆహారం.అల్పాహారంలో కారంతో తయారుచేసిన పదార్థాలను అస్సలు ముట్టొద్దు. ఇవి తినడం వల్ల కడుపులో చాలా అసౌకర్యంగా ఉండటమే గాక.ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల అది కొద్దిగంటలపాటు అది మనను కలవరపెట్టడం ఖాయం. పొద్దున పూట కారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ముడి కూరగాయలు (రా వెజిటేబుల్స్). అదేంటి అందరూ రా వెజిటేబుల్స్ ను తినమంటే మీరొద్దు అనుకుంటున్నారా ముడి కూరగాయలను ఉడికిచ్చి లేదా అలాగే తినడం మంచిదే కానీ.ఖాళీ కడుపుతో మాత్రం తినొద్దట. అది జీర్ణవ్యవస్థమీద అదనపు భారాన్ని మోపుతుందట. ఏదైనా తిన్న తర్వాత కొద్దిసేపటికి వాటిని తింటే ఉపయోగం ఉంటుందట.

అయితే ముడి కూరగాయలు గానీ.ఇతర పోషకాలు నిండిన పండ్లను గానీ తినడాని కంటే ముందు.రాత్రి నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలు.బాదం.ఇతర గింజ పదార్థాలు తింటే మంచిదట. అందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవడమే గాక.బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతాయట.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :