Thursday, January 7, 2021

We love reading guidelines



Read also:

ఈరోజు నుండి ప్రతీ హైస్కూల్, UP స్కూల్ లో ఉదయం 3 వ పీరియడ్ గ్రంధాలయ పీరియడ్ గా నిర్వహించాలి. ఈరోజు తెలుగు పుస్తకాలు చదివించాలి. రేపు ఇంగ్లీష్ పుస్తకాలు చదివించాలి.

పాఠశాలలు రెండు పూటలు ఉంటే ఉదయం 3 వ పీరియడ్, మధ్యాహ్నం 6 వ పీరియడ్ లైబ్రరీ పీరియడ్ లగా రోజుకు రెండు  నిర్వహించాలి. ఉదయం తెలుగు పుస్తకాలు, మధ్యాహ్నం ఇంగ్లీష్ పుస్తకాలు చదివించాలి. ప్రస్తుతం పాఠశాలలు ఒక పూట నిర్వహిస్తున్నందున ఉదయం 3 వ పీరియడ్ లో గ్రంధాలయ పుస్తకాలు ఒక రోజు తెలుగు, రెండొవ రోజు ఇంగ్లీష్ పుస్తకాలు చదివించాలి.

ప్రతీ పాఠశాలలో గ్రంధాలయం పుస్తకాలును తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలుగా విభజన చేయాలి. విద్యార్థుల స్థాయిల ఆధారంగా పుస్తకాలు మరలా నాలుగుగా విభజించాలి.
స్థాయి 1: అక్షరాలు, బొమ్మలు పుస్తకాలు
స్థాయి 2: చిన్న పదాలు గల పుస్తకాలు
స్థాయి 3: చిన్న చిన్న వాక్యాలతో కూడిన పుస్తకాలు
స్థాయి 4: పేరాలు, కథలు మొదలగు పుస్తకాలు

విద్యార్థులను కూడా పై నాలుగు విధాలగా చేసి, వారి స్థాయికి చెందిన పుస్తకాలు వారికీ ఇచ్చి చదివించాలి. ప్రతీ శుక్రవారం విద్యార్థులకు గ్రంధాలయ పుస్తకాలు ఇవ్వాలి. తరగతి గ్రంధాలయ కమిటీ లో తరగతి ఉపాద్యాయునితో పాటు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు.  Library books Issue రిజిస్టర్ ఈ కమిటీ  నిర్వహిస్తుంది.

విద్యార్థులకు చదవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి చర్యలు తీసుకోగలరు. మండల కమిటీలు, GP కమిటీలు, పాఠశాల స్థాయి కమిటీలు GO 220 లో చెప్పినవిధంగా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రతీ పాఠశాల HM నోడల్ పర్సన్ గా ఇవ్వబడిన లింక్ లో  రిజిస్ట్రేషన్ అవ్వాలి.  మండల, GP స్థాయి కమిటీలు  కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి.

మిగతా వివరాలు అన్ని GO 220 లో ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో GO 220 మరియు జిల్లా నుండి ఇవ్వబడిన ప్రొసీడింగ్స్ అన్నీ ఒక ఫైల్ చేసుకోవాలి. అదనపు సమాచారంనకు AMO SS ను సంప్రదించగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :