More ...

Friday, January 8, 2021

Smart Phone Safety TipsRead also:

Smart Phone Safety Tips: మీ స్మార్ట్ ఫోన్ సేఫ్ గా ఉండాలంటే.. ఈ ఏడు చిట్కాలు పాటించండి..

స్మార్ట్ ఫోన్లు మనుషుల దైనందీన జీవితంలో భాగమైపోయ్యాయి. ఎంతలా అంటే.. అవసరానికి ఏమున్నా లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా దానికి అనేక మంది దానికి అతుక్కుపోతున్నారు. విలువైన డేటాను అందులోనే భద్రపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ స్మార్ట్ ఫోన్ సేఫ్టీ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

స్మార్ట్ ఫోన్లు మనుషుల దైనందీన జీవితంలో భాగమైపోయ్యాయి. ఎంతలా అంటే.. అవసరానికి ఏమున్నా లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా దానికి అనేక మంది దానికి అతుక్కుపోతున్నారు. ఇంకా బలంగా చెప్పాలంటే బానిసవుతున్నారు. నిద్ర లేవడమే స్మార్ట్ ఫోన్ ను చూడడం సర్వ సాధారణమైపోయింది. లేచింది మొదలు.. పడుకొనేంత వరకు అత్యంత చేరువైన ప్రాణస్నేహితుడిగా స్మార్ట్ ఫోన్ మారిపోయింది. అవసరానికి మాత్రమే వాడాల్సిన ఈ వస్తువును.. అవసరం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఫలితంగా విజ్ఞానం మాట అలా ఉంచితే భద్రత పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ప్రభావితమవుతున్నారు. వీరి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా పరమైన నియమాలు, చిట్కాలను తల్లిదండ్రులు, పిల్లలకు వివరించడమైంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

-మీ సెల్ ఫోన్ కు ఎప్పుడూ లాక్ పెట్టుకోవాలి. కీప్యాడ్ లాక్ అందులో ప్రధానం. పిన్ లేదా పాస్వర్డ్ ను పెట్టుకోవడం వల్ల భద్రంగా ఉంచుకోవచ్చు. వేరేవాళ్లు మీ ఫోన్ లాక్కున్నా, దొంగిలించినా వారికి సమస్యగా మారుతుంది.

- సెక్సువల్ నేచర్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీయకండి. ఎవరైనా నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు మీ వద్ద ఉంటే అవి చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ఛైల్డ్ పోర్నోగ్రఫి, అశ్లీలత అన్నీ రాష్ట్రాల్లో నిషేధించారు. ఇది ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. మరో విషయమేమంటే ఫోన్ ను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోండి. లేదంటే మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముంది..

-సెల్ ఫోన్ ను కలిగి ఉండటమనేది స్వతంత్ర అధికారం. అంతేకాని ప్రత్యేకమైన హక్కు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు మీకు ఫోన్ ఇవ్వడానికి అనుమతిచ్చారంటే మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. అయితే చాలా మంది యువత ఎలక్ట్రానిక్ పరికరాలను, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. క్రిమినల్, చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ విలువైందిగా భావించండి.

-మీకు సౌకర్యవంతంగా లేని ఫొటోలు, వీడియోలను మీ తల్లిదండ్రులకు షేర్ చేయవద్దు. అలాంటి సందేశాలు కూడా పంపవద్దు.

-మీ ఫోన్ లో ఉండే సందేశాలు, మీరు సృష్టించే ఫొటోలు, వీడియోలు డిజిటల్ సాక్ష్యంగా నిల్వచేయబడతాయి. మీరు డిలీట్ చేసినప్పటికీ మొబైల్ కంపెనీ సర్వర్లలోనో, క్లౌడ్ ఖాతా, మెమొరీ కార్డు, సిమ్ కార్డు లాంటి వాటిలో సేవ్ చేస్తారు.

-చట్టాన్ని ఉల్లఘించినట్లు సహేతుకమైన అనుమానం వచ్చిట్లయితే నిబంధనల ప్రకారం పాఠశాల యజమాన్యం మీ సెల్ ఫోన్ తీసుకునే అవకాశముంది. మీ తల్లిదండ్రుల వచ్చి అభ్యర్థిస్తే ఫోన్ తిరిగి పొందవచ్చు.

-ఎప్పుడూ టెక్స్ట్ చేసి డ్రైవ్ చేయవద్దు. మీ జీవితాన్ని కోల్పోవడం లేదా వేరొకరిని తీసుకోవడం ఏది ఉత్తమం కాదు. ఏదైనా అత్యవసరమైతే, దానితో వ్యవహరించే ముందు వాహనాన్ని సురక్షితమైన ప్రదేశం వద్ద ఆపండి. మీరు విశ్వసించగలగిన, మీకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :