Monday, January 4, 2021

SBI Yono Income Tax Return



Read also:

SBI Yono: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కొత్త కొత్త సదుపాయాలు కల్పిస్తూ తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా SBI తన ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పింది.

  • యోనో యాప్ ద్వారా ఆదాయం పన్ను(ఐటీ) రిటర్నులను ఉచితంగా దాఖలు చేసే సౌకర్యాన్ని SBI తన ఖాతాదారులకు కల్పించింది. ఈ విషయాన్ని బ్యాంక్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది.
  • 2019-20 ఆర్థిక సంవత్సరానికి  ఐటీఆర్‌ దాఖలుకు డిసెంబర్ 31 నుంచి జనవరి 10కి ప్రభుత్వం గడుపు పొడిగించిన విషయం తెలిసిందే. ఐటీఆర్ సదుపాయాన్ని పొందేందుకు ఎస్బీఐ కస్టమర్లు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
  • మొదటగా ఎస్బీఐ యోనో యాప్‌ను ఓపెన్‌ చేసి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం ‘షాప్‌ అండ్‌ ఆర్డర్‌’ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ ట్యాక్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం tax2win ఆప్షన్ పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఐటీఆర్‌కు సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆ స్టెప్స్‌ను ఫాలో అవుతూ రిటర్న్ సులువుగా ఫైల్ చేయవచ్చు.
  • అయితే మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా.. ఏమైనా సందేహాలు ఏర్పడినా +91 9660996655 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని బ్యాంక్ సూచించింది. లేదా support@tax2win.in కు సమస్యను ఈమెయిల్ చేయవచ్చు.
  • CA సేవలను కూడా పొందవచ్చని బ్యాంకు తెలిపింది. కానీ ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు రూ.199 నుంచి ప్రారంభమవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :