Monday, January 4, 2021

Sankranthi Holidays in ap



Read also:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పాఠశాలలకు సంక్రాంతి సెలవులు (Sankranthi holidays) ప్రకటించింది. ఈసారి వారం రోజుల పాటు సెలువులిస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ. ఈ పండుగ కోసం పెద్దలు, పిల్లలు అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. కొత్తబట్టలు, పిండి వంటలు, ముగ్గులు, గంగిరెద్దు, కోడిపందేలతో ఎక్కడా లేని సందడి సంక్రాంతి సొంతం. అలాంటి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. గాలి పటాలు ఎగరస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తెలుగువారి పెద్ద పండుగ సమీపిస్తున్నందున విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఏకంగా వారం రోజుల పాటు సెలవులిస్తన్నట్లు ప్రకటించింది. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సెలవులు ఇచ్చింది.

ఐతే ఈనెల 9వ తేదీన రెండో శనివారం రోజున పాఠశాలలకు సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి బదులుగా ఈనెల 16న అంటే మూడో శనివారంనాడు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు పండుగను కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం రెండో శనివారం సెలవు రద్దు చేసినా మూడో శనివారానికి పొడిగించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం దాదాపు 6 నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత 9, 10వ తరగతులకు క్లాసులను ప్రారంభించిన విద్యాశాఖ ఆ తర్వాత విడతల వారిగా 6,7,8వ తరగతులు చదివే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తోంది. ఇప్పటికీ 1 నుంచి 5వ తరగతుల వారికి ఆన్ లైన్లో విద్యను బోధిస్తోంది. వీరి సంబందించిన వర్క్ షీట్లను అభ్యాస యాప్‌లో ఉంచారు. ఉపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలని పేర్కొన్నారు.

వజ్ఞప్తి: సెలవులలో చిన్న మార్పు ను గమనించగలరు. 9 వ తేదీ SECOND  SATURDAY  సెలవు యధాతదం. 11 వ తేదీ జగనన్న అమ్మవడి  ప్రారంబొత్సవ కార్యక్రమము ఉన్నందున  సోమవారము  వర్కింగ్ డే. జనవరి 12-17  వరకు సంక్రాంతి సెలవలు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :