Monday, January 11, 2021

Reopen the schools after pongal



Read also:

Reopen the schools after Pongal

సంక్రాంతి తరువాత ఏపీలో తెరుచుకొనున్న పాఠశాలలు! రీ ఓపెన్ డేట్ ఇదే

కోవిడ్ కారణంగా మూతపడిన ఏపీలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడానికి సన్నాహాలు చేస్తోన్నారు విద్యాశాఖ అధికారులు. పాఠశాలలు పునః ప్రారంభం తరువాత ఎలాంటి జాగ్రత్తాలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి విధ్యాశాఖ అధికారులు ఒక స్పష్టమైన ప్రతిపాధనతోపాటు ప్రణాళికను కూడా సిద్దం చేశారు. పాఠశాలలు తెరిస్తే ఏ తరగతి విద్యార్ధలకు తెరవాలి అనే అంశానికి సంబంధించి కూడా స్పష్టమైన ప్రతిపాధనలు విద్యాశాఖ అధికారులు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే వాక్సిన్ కి సంబంధించి పనులు కూడా చకచక జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాఠశాలలు తెరిస్తే మంచిదని భావిస్తోన్నారు విధ్యాశాఖ అధికారులు. రాష్ట్రంలో చాలా వరకు సాదారణ పరిస్థితిలు నెలకున్న నేపథ్యంలో విద్యార్ధులకు తరగతును ప్రారంభించడం వలన ఎటువంటి నష్టం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

దీంతోపాటు గతంలో కంటే ఇప్పుడు ఏపీలో కోవిడ్ కేసులు సంఖ్య కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఇదే సరైన టైం అన్ని అధికారలు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విధ్యాశాఖ ప్రతిపాధనలు ముఖ్యమంత్రి వద్దకు పంపించారు ఆ శాఖ అధికారులు. సంక్రాంతి సెలవులు తరువాత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించడానికి అనుమతులు కోసం ముఖ్య మంత్రి వద్ద ప్రతిపాదనలు పెట్టారు. ప్రస్తుతానికి 9 నుంచి ఆ పై తరగతులకు విద్యార్ధలకు మాత్రమే పాఠశాలలు, కాలేజ్ లు ప్రారంభించాలని భావిస్తోన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి సోమవారం జరిగే కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కలెక్టర్ల సమావేశంలో జిల్లాల వారిగా కోవిడ్ పరిస్థితులపై చర్చించిన తరువాత ముఖ్యమంత్రి పాఠశాలు, కాలేజ్ లు ప్రారంభానికి సంబంధిచి ఒక స్పష్టమైన నిర్ణయ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు విద్యాశాఖ అధికారులు.

సంక్రాంతి సెలవులు తరువాత ఈ నెల 18 నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో పాఠశాలలు, కాలేజ్ లు తెరుకోవాడానికి ముఖ్యమంత్రి నిర్ణయతీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మార్గాలను విద్యాశాఖ అధికారులతోపాటు జిల్లావారిగా కలెక్టర్లతో కూడా ముఖ్యమంత్రి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. "ఇప్పటికే మా శాఖ నుంచి ప్రతిపాధనలు ముఖ్యమంత్రి వద్దకు పంపించాం. సంక్రాంతి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభించాడానికి అనుకూలంగా ఉంటుందని ఆ ప్రతిపాధనలో పొందుపరిచాం. ఇప్పటికే కోవిడ్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రతిపాధనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తోన్నాయని." విద్యాశాఖ కు చెందిని పేరు రాయడానికి నిరాకరించిన ఒక ఉన్నత ఉద్యోగి న్యూస్ 18 కి తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :