Thursday, January 7, 2021

new strain guidelines



Read also:

కొత్త కరోనా: ఏపీ సర్కార్‌ మార్గదర్శకాలు

యూకే స్ట్రెయిన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్క్‌ ధరించేలా చూడాలని, కంటైన్‌మెంట్ వ్యూహాలను అనుసరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  ‘‘సంక్రాంతి దృష్ట్యా భారీ జనసమూహాలు లేకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న 1,519 నమూనా సేకరణ కేంద్రాలను వికేంద్రీకరించాలి. కరోనా టోల్‌ ఫ్రీ నంబర్‌ 104ను కొనసాగించాలి. కంటైన్‌మెంట్‌ జోన్లను నోటిఫై చేయడంతో పాటు ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని’’ వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇంటింటి సర్వే చేపట్టాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కోవిడ్‌తో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్ధిక సాయం అందించాలని, రాష్ట్రంలోని ప్రతి కోవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలి. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందేలా చూడాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :