Thursday, January 7, 2021

Key decisions by CM Jagan



Read also:

>
  • లే అవుట్లను అభివృద్ధిచేయనున్న ప్రభుత్వం
  • లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయింపు
  • మున్సిపల్‌శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌‌ ఆదేశాలు

అమరావతి: పట్టణ, నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్భన్‌ డవలప్‌మెంట్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..: 

►పట్టణాలు, నగరాల్లో వైఎస్సార్‌ హయాంలో రాజీవ్‌ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగేది.
►మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమ ఉద్దేశం..
►ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్‌ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలన్నది ఆలోచన..
►ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధిచేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయించాలి..
►ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయి..
►సరైన టైటిల్‌ ఉందా? అన్నిరకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అనే భయాలు వారికి ఉన్నాయి.
►లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవు..
►వివాదాలు లేకుండా, క్లియర్‌ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి
►లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలి
►మధ్యతరగతి ప్రజలకోసం కూడా ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చింది
సమావేశంలో చర్చకు వచ్చిన మరికొన్ని అంశాలు
►భీమిలి నుంచి భోగాపురం వరకూ సముద్ర తీరం వెంబడి ఆకె లేన్ల బీచ్‌ రోడ్డు
►ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నామన్న అధికారులు
►ఈ రహదారిలో భాగంగా గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జి నిర్మాణం
►విశాఖపట్నానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుందన్న సీఎం
►దీనిపై సమగ్ర కార్యాచరణకు సీఎం ఆదేశం
►శాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై కొత్త విధానాలను కూడా పరిశీలించాలి 
►పట్టణ గృహనిర్మాణాన్ని వేగతవంతం చేయాలి
►మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలతో మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు,
►దీనికి సంబంధించి రూ.1000 కోట్లతో డీపీఆర్‌ను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం ఆదేశం.
►ఈ లే అవుట్లను వినూత్నంగా, అందంగా తీర్చిదిద్దాలి
►దీనిపై మేథోమథనం చేసి ఒక పాలసీని తీసుకురావాలని సీఎం ఆదేశం
►వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో అండర్‌ గ్రౌండ్ ‌డ్రైనేజీ సహా ఇతర అంశాలపై దృష్టిపెట్టమని కలెక్టర్లకు చెప్పాం.
►ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై కూడా  ఆలోచించమని చెప్పాం
►లే అవుట్‌ల అందాన్ని పెంచేలా వినూత్నంగా ఆలోచనలు చేయమని చెప్పాం
►బస్‌ బే తోపాటు, సృజనాత్మకంగా బస్టాప్‌ కట్టమని చెప్పాం
►పట్టణాభివృద్ధి సంస్ధల పరిధిలో దాదాపు 16 వేలకుపైగా లే అవుట్స్‌ వచ్చాయి
►రాష్ట్రంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉంటే.. మనం మరో 17వేల కాలనీలు కడుతున్నాం
►కొన్నిచోట్ల నగర పంచాయతీలుగా కూడా చేస్తున్నాం
►పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌.. ఇవన్నీకూడా ఈ కాలనీల్లో తీసుకు రావాలి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :