More ...

Wednesday, January 13, 2021

Iron deficiencyRead also:

Iron deficiency

మానవ శరీరంలో ఐరన్(Iron) చాలా అవసరం. దీన్నే హిమోగ్లోబిన్ అని కూడా అంటారు. రక్తంలో కావాల్సిన మోతాదులో హిమోగ్లోబిన్ లేకపోతే, ఇది దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది క్రమంగా రక్తహీనత(Anemia )కు కూడా కారణమవుతుంది. ఫలితంగా రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువవుతుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) స్పష్టం చేస్తోంది. ఇటీవల, మనుషుల్లో ఐరన్ లోపంపై యూనిసెఫ్(UNICEF) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యధిక మంది యువకులు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల- వారు 1.2 బిలియన్ల మంది ఉండగా, వారిలో 243 మిలియన్ల మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల్లో 56 శాతం మంది, బాలురులో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. కాబట్టి, బాలబాలికల్లో హిమోగ్లోబిన్ (Hemoglobin) స్థాయిలను మెరుగుపరచడానికి తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, శరీరంలో ఐరన్ స్థాయిలను మెరుగుపర్చడంలో సహాయపడే కొన్ని సాధారణ గృహ నివారణలను కూడా సూచించారు. వాటిపై ఓ లుక్కేయండి.

నల్ల నువ్వులు

వీటిలో ఇనుము(Iron), రాగి(Copper), జింక్(Zinc), సెలీనియం(Selenium), విటమిన్–బి6, విటిమిన్–ఈ, ఫోలేట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీ శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

ఎలా తినాలి?

సుమారు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, డ్రై రోస్ట్లను ఒక టీస్పూన్ తేనె(Honey), నెయ్యి(Ghee)తో కలపండి. ఈ మిశ్రమాన్ని లడ్డూల వలే ముద్దగా చేసుకొని తినండి. మీ శరీరంలో ఇనుము స్థాయిని పెంచుకోవడానికి ఈ పోషకమైన లడ్డూను క్రమం తప్పకుండా తీసుకోండి.

ఖర్జూరా, ఎండుద్రాక్ష

ఈ పొడి పండ్ల కలయికలో ఇనుము(Iron), మెగ్నీషియం(Magnesium), రాగి(Copper), విటమిన్–ఎ, విటమిన్–సి వంటివి పుష్కలంగా లభిస్తాయి.

ఎలా తినాలి?

2 నుంచి 3 ఖర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షలను ఉదయాన్నే అల్పాహారంగా లేదా సాయంత్రం పూట స్నాక్స్ లాగా తిన్నారంటే మీరు తక్షణ శక్తిని పొందడమేకాక, మీ శరీరంలో ఐరన్ స్థాయిలను కూడా పెంచుకోవచ్చు.

బీట్రూట్లు, క్యారెట్లు

తాజా బీట్రూట్(Beetroots), క్యారెట్లు (Carrots) కలిపి చేసిన జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. నిమ్మరసం దీనికి విటమిన్–సి కంటెంట్ను కూడా జోడిస్తుంది.

ఎలా తినాలి?

ఒక కప్పు తరిగిన బీట్రూట్స్, కప్పు తరిగిన క్యారెట్లు మిక్సీలో వేసి బాగా కలపండి. ఆ రసాన్ని వడకట్టి, ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఆ రసాన్ని ప్రతి రోజు ఉదయం క్రమం తప్పకుండా తీసుకోండి.

వీట్గ్రాస్

ఇది బీటా కెరోటిన్(Beta -Carotene), విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ విటమిన్ సి, విటమిన్ బి వంటి అనేక అద్భుతమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, అనేక రకాల రక్త నిర్మాణ కారకాలను కూడా ఇది కలిగి ఉంటుంది.

ఎలా తినాలి?

ప్రతిరోజూ ఉదయం ఒక స్పూన్ వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల మీ హిమోగ్లోబిన్ (Hemoglobin) స్థాయిలు మెరుగుపడటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

మోరింగా ఆకులు

మోరింగా విత్తనాలు, ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఇనుము, విటమిన్లు ఎ, విటమిన్ సిలతో పాటు మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి.

ఎలా తినాలి?

ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయం 1 టీ స్పూన్ మోరింగా ఆకు పొడి తింటే శరీరంలో ఐరన్ లెవెల్ పెరుగుతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :