Thursday, January 7, 2021

Highlights of the video conference Nadu Nedu



Read also:

మనబడి నాడు-నేడు నిన్న జరిగిన    వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశములు

  • చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లో మావద్ద డబ్బులు లేవు కాబట్టి పెయింటింగ్ వెయ్యవద్దని చెప్పకూడదు.
  • డబ్బులు లేకపోతే రివైజ్డ్ సాంక్షన్ తీసుకోవాలి.
  • కాబట్టి వచ్చిన పెయింటింగ్ వారి చేత రంగులు వేయించాలి.
  • వాల్ ఆర్టులు ప్రాథమిక పాఠశాలలకు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రమే వెయ్యాలి.
  • కాంపౌండ్ వాల్స్ కి కేవలం ఎంట్రన్స్ లో గేటుకి అటూ ఇటూ ముందు భాగంలో మాత్రమే రంగులు వేయాలి.
  • గతంలో బాగా మంచి వాల్ ఆర్టులు వేసినవి మార్చక్కర్లేదు.. పైన ఒక కోటింగ్ రంగు వేస్తే సరిపోతుందని చెప్పారు. 
  • కొద్ది రోజుల్లో రిపోర్ట్ 4.12 స్కూల్ school analysis పెడతారు. కాబట్టి అన్ని పాఠశాలలు HM LOGIN లో school analysis పూర్తి చేయాలి.
  • APEWIDC వారు టీవీ సరఫరాలకు ఇన్వాయిస్లు అప్లోడ్ చేయడానికి ప్రధాన బాధ్యులు.(కస్టోడియన్) 
  • టీవీలో పక్కన స్విచ్ఛ్ బోర్డు లు ఖచ్చితంగా పెట్టాలి.
  • గౌరవ ముఖ్యమంత్రివర్యులు తదుపరి సమీక్షా సమావేశం లో ఎన్ని పాఠశాలలు ఎన్నెన్ని కాంపోనెంట్లు పూర్తి చేసారు.. అసలు పూర్తి చేయని పాఠశాలలు ఎన్ని అనే విషయాలను అడుగుతామని పాఠశాల విద్యాశాఖ కు తెలియజేసారు.
  • వర్క్ క్లోజ్ అంటే ఫీల్డ్ లెవెల్ లో పని పూర్తి చేయడం.. ఎక్సపండీచర్ బుక్ చేయడం.. ఫొటోలు అప్లోడ్ చేయడం.
  • School analysis ఇంకా చాలా మండలాల్లో జరుగటలేదని తెలియజేసారు.
  • తక్కువ ఖర్చుతో కూడుకున్న పనులకు మాత్రమే రీ ఎస్టిమేట్స్ ఇవ్వమన్నారు.
  • మండలాలను రెండు పెయింటింగ్ కంపెనీలకు (ఏషియన్ మరియు బెర్జర్) వారికి పెంచుతారు.
  • నాడు-నేడు ఫొటోలు ఖచ్చితమైనవి పంపమన్నారు.
  • 50 నాడు-నేడు ఫొటోలు అంటే 5 పాఠశాలల వి ఒకే డైమన్షన్ లో ఉండేవి పంపాలి.. నాడు లో మార్పులు చేసినవి నేడులో చూపించాలి. నేడు ఫొటోలు నాడుకంటే బాగుండాలి.
  • వాల్ ఆర్టులు లోకల్ ఆర్ట్ టీచర్లు చేత చేయించవలెను.
  • రెండు మూడు రోజుల్లో రివాల్వింగ్ ఫండ్స్ జమవుతాయని తెలియజేసారు.
  • ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు చిన్న చిన్న పనులు తక్షణమే పూర్తి చేయాలని కనీస రంగులతో పాఠశాలల సుందరీకరణ పూర్తి చేయాలని తెలియజేసారు.
  • తొమ్మిది జనవరి 2021 .. పది జనవరి 2021 పాఠశాలలకు సెలవలు.
  • పదకొండు జనవరి 2021 పని దినము
  • 12-01-2021 నుంచి 17--01-2021 వరకు పాఠశాలలకు సెలవలు
  • అమ్మ ఒడి కార్యక్రమం ఈ సంవత్సరం 11-01-2021న ప్రారంభించబడును. 
  • 11-01-2021 ఉదయం పదకొండు గంటలకు మండల స్థాయిలో ఎక్కడైనా శాశన సభ్యులు చేత  అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించాలని అదే సభలో గౌరవ ముఖ్యమంత్రివర్యులచేత ప్రారంభించబడే కార్యక్రమం చూడడానికి సభలో పెద్ద టీవీ లు పెట్టాలి.
  • అమ్మ ఒడి కార్యక్రమం ప్రతీ పాఠశాలలో జరపాలని తెలియజేసారు. 
  • జిల్లా స్థాయి లో కూడా  అమ్మ ఒడి కార్యక్రమం చేయాలి.
  • ఈ సంవత్సరం  అమ్మ ఒడి లబ్ధిదారులకు పద్నాలుగు వేలు ఇచ్చి మిగిలిన వెయ్యి రూపాయలు  టాయిలెట్స్ నిర్వహణ నిమిత్తం పాఠశాలల పిసీ ఖాతాలకు జమచేయడం జరుగుతుందని తెలియజేసారు. ఈ ఫండ్ కేవలం టాయిలెట్స్ నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలి. ఇంకే పనికి ఉపయోగించకూడదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :