Friday, January 8, 2021

Eggs For Weight Loss



Read also:

Eggs For Weight loss: పోషకాల భాండాగారంగా ఉన్న కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి. ప్రోటీన్ పుష్కలంగా దొరికే ఎగ్ ను బరువు తగ్గడానికి కూడా తినొచ్చు. బరువు తగ్గేవాళ్లు గుడ్డును తమ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితాలు రాబడతారు.

మార్కెట్ లో ఏ సీజన్ లో అయినా లభ్యమయ్యే ఆహార పదార్థాలలో గుడ్లు ఒకటి. పోషకాల గని గా పేరున్న గుడ్డులో ఎన్నో సుగుణాలున్నాయి. బరువు తగ్గేవాళ్లు దీనిని తింటే వారికి మంచి ఫలితాలు కనబడతాయి. అయితే గుడ్డును ఏ సమయంలో తినాలి..? ఏం టైంలో తింటే బరువు తగ్గుతారు..? అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం.

అల్పాహారంలో.. ఉదయం పూట కోడిగుడ్డును తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు మీకు త్వరగా ఆకలి కాకుండా నిరోధిస్తాయి. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.

వ్యాయామం తర్వాత. వ్యాయామం చేసిన తర్వాత ఆకలి ఎక్కువగా వేస్తుంది. అయితే ఈ సమయంలో ఇప్పుడే ఎక్సర్సైజ్ చేశాం కదా అని ఏది పడితే అది తినకూడదు. ఉదయం వ్యాయామం తర్వాత కండరాలకు శక్తి ఎంతో అవసరం. అందుకోసం గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి.

రాత్రిపూట. పలు అధ్యయనాల ప్రకారం రాత్రి పూట గుడ్డు తింటే ఆరోగ్యకరమైన డిన్నర్. మరికొన్ని అధ్యయనాలేమో.. రాత్రి గుడ్డు తింటే అది నిద్రలేమికి దారితీస్తుందని తెలిపాయి. అయితే ఈ విషయంలో మీకు సరిపోయేదాన్ని ఎంపికచేసుకుని తినడం ఉత్తమం.

బరువు తగ్గడానికి. గుడ్లను ఫ్రైగా చేసుకుని తినాలనుకునేవాళ్లు దానికోసం మంచి నూనెను మాత్రమే వాడాలి. నూనెలో గుడ్లను ఉడికించి తినడం మంచిది. ఇది గుడ్లలో ఉండే పోషకాలు క్షీణించకుండా చూస్తుంది.

గుడ్లలో ఎన్ని కేలరీలుంటాయి..? ఒక పెద్ద గుడ్డులో 78 కేలరీలుంటాయి. పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

గుడ్ల ద్వారా బరువు తగ్గొచ్చా...? అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో ఆటోమేటిక్ గా బరువు కూడా తగ్గుతుంది.

రోజుకు ఎన్ని గుడ్లను తినాలి...? రోజుకు ఒక గుడ్డు నుంచి రెండు గుడ్ల దాకా తినడం సురక్షితం. అది ఆరోగ్యకరమే గాక గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :