Tuesday, January 12, 2021

Covishield Vaccine



Read also:

We've given a special price of Rs 200 for the first 100 mn doses only to GoI on their request, that we want to support common man, vulnerable, poor, healthcare workers. After that we'll be selling it at Rs 1000 in pvt markets: Adar Poonawalla, CEO-Owner, Serum Institute of India.

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కోవిషీల్డ్ వాక్సిన్‌లు చేరుకున్నాయి. జనవరి 16 నుంచి దేశమంతా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. తొలి దశంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే రూ.200కు ఇస్తున్నామని.. ప్రైవేట్ మార్కెట్‌లో ఒక్క డోసు వ్యాక్సిన్‌ను రూ.వెయ్యికి విక్రయిస్తామని సీరం సీఈవో అడర్ పూనావల్లా స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తొలి 10 కోట్ల వ్యాక్సిన్ డోసులకు మాత్రమే రూ.200 ప్రత్యేక ధరకు అందజేస్తున్నాం. సాధారణ ప్రజలు, పేదలు, ఆరోగ్య సిబ్బందికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నాం. దేశానికి, భారత ప్రభుత్వానికి సాయం చేసేందుకే తొలి 10 కోట్ల డోసు‌లను తక్కువ ధరకు అందజేస్తున్నాం. ఇందులో ఎలాంటి లాభాన్ని ఆశించడం లేదు. కానీ ఆ తర్వాత ప్రైవేట్ మార్కెట్‌లో డోసుకు రూ. వెయ్యికి విక్రయిస్తాం.'' అని అడర్ పూనావల్లా పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు సీరం వ్యాక్సిన్ కోసం అభ్యర్థిస్తున్నాయని అడర్ పూనావల్లా తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరినీ సంతోషంగా చూడాలన్నదే మా ప్రయత్నం.. కానీ ముందు మన దేశ ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాత ఆఫ్రికాతో పాటు ఉత్తర అమెరికాకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని భావిస్తున్నట్లు అడర్ పూనావల్లా వెల్లడించారు. ప్రతి నెలా 7 కోట్ల నుంచి 8 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నామని.. భారత్‌తో పాటు ఇతర దేశాలకు ఎలా పంపిణీ చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ట్రక్కులు, వ్యాన్లు, కోల్డ్ స్టోరేజీల కోసం ఎన్నో సంస్థలతో భాగస్వామ్యం చేసుకున్నామని తెలిపారు.

కాగా, మన దేశంలో SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి టీకాలను కేంద్రం కొనుగోలు చేస్తోంది. కోవిషీల్డ్ ధర ఖరారు కగా.. కొవాగ్జిన్ ధర ఖరారు కావాల్సి ఉంది. అంతే కొన్ని టీకాలను ఉచితంగా ఇవ్వాలని ఇరు కంపెనీలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుంది. పీఎం కేర్స్ నుంచి అందుకోసం నిధులను కేటాయించినట్లు తెలిసింది. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :