Tuesday, January 5, 2021

Covid-19 Vaccine



Read also:

కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో శుభవార్త. ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. జనవరి 13వ తేదీ నుంచి దేశమంతటా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.

కాగా, మొదట ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి.. ఆ తర్వాత పోలీసులకు టీకా వేయనున్నట్లు సమాచారం. కాగా, జనవరి 3వ తేదీన ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్‌ కోసం కరోనా వారియర్స్ ‘కోవిన్’ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులూ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తామని కేంద్రం తెలిపింది. కాగా, జనవరి 3వ తేదీన ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :