Wednesday, January 13, 2021

Counseling for the remaining 266 iiit seats by the end of this month



Read also:

Counseling for the remaining 266 iiit seats by the end of this month

1. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 4,134 సీట్లు భర్తీ అయ్యాయి.సోమవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సాగింది.మిగిలిన 266 సీట్లకు ఈనెలాఖరులో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

2. ఒక్కో ట్రిపుల్‌ఐటీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిసి 1100 సీట్లతో నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 4400 సీట్లు ఉన్నాయి.ఇందుకు సంబంధించి ఇడుపులపాయ, నూజివీడు కేంద్రంగా ఈనెల4 నుంచి సోమవారం రాత్రి వరకు నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి వర్సిటీ కులపతి కేసీరెడ్డి నేతృత్వంలో అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు కొందరు విద్యార్థులు గైర్హాజరు కావడంతో వారి వెనుక ఉన్న ర్యాంకుల విద్యార్థులకు సీట్లు కేటాయించారు.

3. ఈ నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో స్పెషల్‌ కేటగిరి కింద క్రీడలు, ఎన్‌సీసీ, దివ్యాంగులు, ఆర్మ్‌డ్‌ రిజర్వుడు కుటుంబాల పిల్లలకు 257 సీట్లు కేటాయించారు.ఇవి కాకుండా 4,127 సీట్లకు అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించగా శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీకి సంబంధించి ఎస్టీ కేటగిరి కింద 9 సీట్లు మిగిలిపోయాయి.

4. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌ పరిధిలోని కడప,కర్నూలు , అనంతపురం, చిత్తూరు , నెల్లూరు జిల్లాలకు సంబందించి 7 సీట్లు మిగిలిపోయాయి.

ప్రత్యేక కేటగిరి కోటాకింద 257 సీట్లకు, ఎస్టీ కోటాకింద మిగిలిన 9 సీట్లకు ఈనెలాఖరులో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తారని వర్సిటీ కులపతి కేసీరెడ్డి, ప్రవేశాల విభాగం కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌ గోపాలరాజు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :