Friday, January 1, 2021

Corona Vaccine



Read also:

సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో తొలిసారిగా కరోనాకు ఈ వ్యాక్సిన్ వినియోగించనున్నారు. ఆక్స్‌ఫర్డ్ - అస్త్రాజెనికాతో కలసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసింది.

Corona Vaccine


  • సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో తొలిసారిగా కరోనాకు ఈ వ్యాక్సిన్ వినియోగించనున్నారు.
  • ఆక్స్‌ఫర్డ్ - అస్త్రాజెనికాతో కలసి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసింది.
  • కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఐదు గంటల పాటు చర్చించింది. కరోనాకు సంబంధించి ఏ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వాలనేదానిపై చర్చించింది.
  • వ్యాక్సిన్‌ సామర్థ్యం, ఎంత సమర్థంగా పనిచేస్తుంది? ఇతరత్రా అంశాలను పరిశీలించి చివరకు కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చింది.
  • కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర భారత ప్రభుత్వానికి రూ.440కు అందిస్తుంది సీరం ఇన్‌స్టిట్యూట్. అదే, బహిరంగ మార్కెట్‌లో ఈ ధర రూ.700 నుంచి రూ.800 వరకు ఉండొచ్చని చెప్పింది.
  • దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జనవరి 2 నుంచి డ్రైరన్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
  • మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 80 కోట్ల సిరంజిలను ఆర్డర్ చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :