Monday, January 4, 2021

అమ్మఒడి రీ వెరిఫికేషన్ ఎలా చేయాలి



Read also:

రీ వెరిఫికేషన్ లో మొత్తం మూడు పార్ట్ లు గా ఉన్నాయి.అవి  S1, S2, S3

మొదటి పార్ట్ S1 లో

విద్యార్థి వివరాలు ఒక్కసారి మాత్రమే వెరిఫికేషన్ చేయగలం

విద్యార్థి ID నెం , ఆధార్ సంఖ్య , తరగతి , తల్లి/సంరక్షకుని పేరు , తల్లి / సంరక్షకుని ఆధార్ సంఖ్య , రేషన్ కార్డు సంఖ్య , మొబైల్ నెంబర్ మొదలగు వివరాలతో ఉండి చివర *VIEW* అనే బటన్ ప్రతి విద్యార్థికి ఉంటుంది.ఒక్కొక్క విద్యార్థిని మనం VIEW బటన్ నొక్కి సరిచూసుకొని వాటిని సరిచూసుకొని

Verified found correct

లేదా

verified found not correct

లేదా

further verification required

లలో ఒకదానిని ఆ విద్యార్థికి select చేసి remarks లో ఇంకా ఏమైనా ఉంటే పొందు పరచాలి.మరేది ఆ విద్యార్థి అవసరం లేక పోతే remarks లో

Verified found correct

లేదా

verifaid found not correct

లేదా

further verification required

వ్రాయాలి

Remarks box ఖాళీగా ఉంచి submit చేస్తే submit కాదు

ఇలా S1 FORM... ఎంతమంది విద్యార్థులు ఉంటే వారి అందరికి ఇది పూర్తి చేయాలి

తరువాత S2 ఫారం ఓపెన్ చేయాలి.

S1 పూర్తి చేయకుండా S2 OPEN కాదని గమనించండి

S1 లో మనం వెరిఫికేషన్ చేసిన విద్యార్థులు అందరి వివరాలతో కూడిన PDF ఫైల్ ఒకటి డౌన్ లోడ్ అవుతుంది.*దానిలో మనం REMARKS లో ఏమి ఎంటర్ చేశామో ఆ REMARKS కనిపిస్తాయి.

ఇక్కడితో S2 పూర్తి అయినట్టే

ఇప్పుడు S3 లో

మనకు S2 లో DOWNLOAD అయిన PDF పై

1.ప్రధానోపాధ్యాయుడు

2.సచివాలయ సిబ్బంది

3.పేరెంట్ కమిటీ సభ్యులలో ఒకరు

పరిశీలన జరిగినట్టు గా సంతకాలు చేయించాలి.దానిని స్కాన్ చేసి PDF గా మార్చాలి.అప్పుడు S3 ను ఓపెన్ చేస్తే HM ఫోన్ నెంబర్ కనిపిస్తుంది.దానిని మార్చాలి అంటే మార్చుకొని CAPTCHA ను enter చేయాలి.అప్పుడు HM మొబైల్ కు ఒక OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి సంతకలతో కూడిన PDF ను UPLOAD చేయాలి

ఇక్కడితో S3 పూర్తి అయినది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :