Thursday, January 7, 2021

బేసిక్ పే కంటే అలవెన్సులు ఎక్కువుగా ఉంటే వేతనంలో కోత



Read also:

బేసిక్ పే కంటే అలవెన్సులు ఎక్కువుగా ఉంటే వేతనంలో కోత
  • కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ప్రైవేట్ కంపెనీలు ఆమోదం తెలిపాయి. ఈ కొత్త చట్టం మేరకు మూలాధన వేతనం (బేసిక్ పే) కంటే ఇతర ఇలవెన్సులు అధికంగా ఉంటే మాత్రం వేతనంలో కోతపడనుంది. అంటే జీతంలో 10 నుంచి 12శాతం తగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ కొత్త వేతన సవరణ చట్టం ఈ యేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.
  • నూతన వేతన సవరణ చట్టం-2019 నిబంధనలు వచ్చే ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రకారం మీ మొత్తం జీతంలో ఇతర అలవెన్సుల పద్దులు 50 శాతం మించరాదు. ఈ లెక్కన మీకు చెల్లిస్తున్న జీతంలో 50 శాతం బేసిక్ పే ఉండి తీరాలి.
  • కొత్త నిబంధనలను అంగీకరించిన యాజమాన్యాలు ఉద్యోగికి చెల్లించే మొత్తం జీతంలో 50శాతం బేసిక్ పే ఉండేలా చూసుకోవాలి.
  • దీని ఫలితంగా ఉద్యోగికి సంస్థ చెల్లించాల్సిన గ్రాట్యూటీ పెరుగుతుంది.
  • అలాగే, ప్రావిడెంట్ ఫండ్ కోసం ఉద్యోగి చెల్లించాల్సిన మొత్తం కూడా పెరగక తప్పదు. ఈ సర్దుబాటుల కారణంగా ప్రతి నెలా ఇంటికి తీసుకెళ్లే జీతంలో ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ, పదవీ విరమణ తర్వాత పొందే మొత్తం భారీగా వస్తుంది.
  • కొత్త వేతన సవరణ చట్టం ప్రకారం జీతాల చెల్లింపు విధానంలో సమూల మార్పులు తీసుకురానున్నది. వీటి ప్రభావం ప్రభుత్వ రంగం కంటే ఎక్కువగా ప్రైవేట్ రంగంపై ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతంలో బేసిక్ పే 50 శాతం కంటే తక్కువగా ఇతర అలవెన్సులు ఎక్కువగా ఉంటున్నాయి.
  • వీటిలో మార్పులు చేసి బేసిక్ పేను 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా జీతం తగ్గినా సామాజిక భద్రత, పదవీ విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అధికంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :