Monday, January 4, 2021

నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌



Read also:

  • ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందనున్న అభ్యర్థులకు నేటి నుంచి నూజివీడు, ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. నూజివీడు క్యాంపస్‌లోని కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరవుతారు. ప్రవేశాల సమన్వయకర్త ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు నిన్న (జ‌న‌వ‌రి 3న‌) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 
  • నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో వెయ్యేసి చొప్పున 4 వేల సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అదనంగా 10 శాతంతో మరో 400 సీట్లను భర్తీచేస్తారు. జ‌న‌వ‌రి 3న‌ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ పారదర్శకంగా ఉండేలా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.
  • నూజివీడు, ఆర్కేవ్యాలీలలో ఒకేసారి కౌన్సెలింగ్‌ నిర్వహించేలా రెండు క్యాంపస్‌లను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం చేశారు.
  • రెండు క్యాంపస్‌లను సమన్వయపరిచి ఖాళీలు, ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీచేస్తారు.
  • డేటా స్క్రీన్‌పై అభ్యర్థులు ఖాళీలు తెలుసుకునేలా సమాచారం అప్‌డేట్‌ అవుతుంటుంది.
  • బాలికలకు 33% రిజర్వేషన్‌ అమలయ్యేలా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం ర్యాంకుల ఆధారంగా కూడా సీట్లు కేటాయిస్తారు.
  • కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు కొనుగోలుపై అల్పాహారం, భోజనం వసతి కల్పిస్తున్నారు.
  • ఉదయం కౌన్సెలింగ్‌కు వచ్చేవారు 8 గంటల లోపు, మధ్యాహ్నం వచ్చేవారు 12 గంటల లోపు కౌన్సెలింగ్‌ హాలుకు చేరుకోవాలి.
  • ఇక్కడకు వచ్చే అభ్యర్థులు నాలుగు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లలో దేనిని ఎంపిక చేసుకున్నా ఖాళీలకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు.
  • నూజివీడులో కౌన్సెలింగ్‌ నిర్వహణ సాఫీగా సాగడానికి 25 కౌంటర్లు, 100 మంది అధ్యాపక సిబ్బంది, 100 మంది విద్యార్థులను ఏర్పాటు చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :