Wednesday, January 13, 2021

పల్లెటూరులో పాలు అమ్మి రూ. కోటి సంపాదన



Read also:

పల్లెటూరులో పాలు అమ్మి రూ. కోటి సంపాదన.. ఆ 62 ఏళ్ల మహిళ అద్భుతాలు ఎలా సృష్టించిందంటే.

చిన్న పని, పెద్ద పని అని ఉండదు.. మనసుకు నచ్చిన పని చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పనిలో ఆనందం వెతుక్కుంటే అది ఎంత కష్టమైనా ఇష్టంగా చేయవచ్చు. కష్టాన్ని నమ్ముకుంటే ఏ పనిలోనూ ఓడిపోము. అవును.. ఇందుకు ఉదాహరణగానే ఇష్టపడి పనిచేస్తే అందులోనే విజయం సాధించవచ్చని నిరూపించింది గుజరాత్ కు చెందిన ఓ మహిళ. పాలు అమ్మి ఏకంగా కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. గుజరాత్ లోని బానాస్కాంత జిల్లాలో నాగానా గ్రామానికి చెందిన నావల్ బెన్ దాల్సాంగ్ భాయ్ చౌదరి వయస్సు 62 ఏళ్లు. ఇంట్లోనే పశువులను పెంచి వాటి నుంచి వచ్చే పాలతో వ్యాపారం చేసి కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. అవును 2020 ఏడాదిలో నెలకు రూ.3.50 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయల లాభాన్ని ఆర్జించింది. మొత్తం 80 గేదేలు, 45 ఆవులతో డైరీని ప్రారంభించి విజయం సాధించింది.
పల్లెటూరులో పాలు అమ్మి రూ. కోటి సంపాదన
నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె 2019లో రూ.87.95 లక్షలు సంపాదించింది. గేదేలు, ఆవులను పోషించేందుకు, డైరీ నిర్వహణకు ఆమెకు సహాయంగా 15 మంది సేవకులను నియమించింది. ఫలితంగా నవాల్ బెన్ మంచి సంపాదను అందుకోవడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రయత్నాలకు ప్రతిఫలంగా బానాస్కాంత జిల్లాలో మూడుసార్లు ఉత్తమ పశుపాలక అవార్డును పొందింది. అంతేకాకుండా రెండు సార్లు 'లక్ష్మీ' పురస్కారం కూడా అందుకుంది.

"నేను 80 గేదేలు, 45 ఆవులతో డైరీ నడుపుతున్నా. వాటి ద్వారా వచ్చిన పాలను అమ్మి 2019లో రూ.87.95 లక్షలు సంపాదించా. ఈ పనిలో ఇంత మొత్తం సంపాదించడం మా జిల్లాలోనే నేనే మొదటి వ్యక్తిని. 2020లో కోటి 10 లక్షల రూపాయలను ఆర్జించా" నవాల్ బెన్ తెలిపారు. 2020 ఆగస్టులో ఈమె అముల్ సంస్థ ప్రకటించిన 10 మిలియన్లు సంపాదించిన టాప్-10 రూరల్ ఉమన్ ఎంటర్ ప్రెన్యూర్ జాబితాలో చోటుదక్కించుకుంది.

గతంలో 8ఏళ్ల బాలుడు యూట్యూబ్ లో బొమ్మలను సమీక్షించడం ద్వారా 2019లో రూ.195 కోట్లు సంపాదించారు. ర్యాన్ కేజీ అనే పేరు గల పిల్లవాడు 2019లో ప్రపంచంలోనే అత్యంత పారితోషికం పొందిన యూట్యూబ్ సంచలనంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు తన యూట్యూబ్ ఛానెల్ ను 2015లో ప్రారంభించాడు. అతనికి ఇప్పుడు 27 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అతను జూన్ 2018 నుండి జూన్ 2019 వరకు 26 మిలియన్ డాలర్లు సంపాదించాడు. బొమ్మలను అన్‌బాక్స్ చేయడం ద్వారా అతను వాటిని సమీక్షిస్తాడు అంతేకాకుండా తన అనుభవాన్ని పంచుకుంటాడు. ర్యాన్ ఛానెల్ అతని తల్లిదండ్రులచే నిర్వహించబడుతోంది. కోల్‌గేట్, నికెలోడియన్, రోకు, వాల్‌మార్ట్ లాంటి తదితర సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :