Monday, January 11, 2021

AP Panchayat Election Schedule Cancelled by AP High Court



Read also:

AP Panchayat Election Schedule Cancelled by AP High Court


పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది.

పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. 

వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్‌ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరఫున ఏజీ, ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. 

ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది. తాజా తీర్పు నేపథ్యంలో డివిజినల్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ నెల 8న ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈఎస్‌ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :