Saturday, January 2, 2021

AP Local Body Elections



Read also:

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొన్ని రోజులుగా వివాదం జరుతుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంటే ప్రభుత్వం దీనికి ససేమిరా అంటోంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా లేమని ఏపీ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల పై క్లారిటీ లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన చేస్తామని ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పరిపాలన పొడగిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది.

మండల పరిషత్‌లో జూలై 3, జిల్లా పరిషత్ లో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :