Friday, January 15, 2021

anganwadi centers



Read also:

కరోనా సమయంలో మూతబడిన అంగన్వాడీ కేంద్రాలు నేటికీ తెరుచుకోని విషయం తెలిసిందే. అయితే ఈ కేంద్రాలను వెంటనే తెరవాలని మహారాష్ట్రకు చెందిన దీపిక జగత్‌రామ్ సహానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా సమయంలో మూతబడిన అంగన్వాడీ కేంద్రాలు నేటికీ తెరుచుకోని విషయం తెలిసిందే. అయితే ఈ కేంద్రాలను వెంటనే తెరవాలని మహారాష్ట్రకు చెందిన దీపిక జగత్‌రామ్ సహానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలను తిరగి ప్రారంభించడంపై ఈ జనవరి 31వ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, విపత్తు నిర్వహణ అధికారులను సంప్రదించిన అనంతరం మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీంతో పాటు ఆహార భద్రత చట్టం ప్రకారం తప్పనిసరిగా గర్భిణులు, చిన్నారులు, తల్లులకు పోషకాహారాన్ని అందించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ప్రజలందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి టీకా వేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. తొలి దశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన డ్రైరన్ ను నిర్వహించింది. వ్యాక్సినేషన్ ప్రకియలో ఎదురయ్యే సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం చేశారు. అలాగే వ్యాక్సిన్ కోసం రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మహారాష్ట్రలోని పూణే ల్యాబ్ నుంచి వ్యాక్సిన్ వైల్స్ ను స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చిన అధికారులు.., గన్నవంలోనే వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్ కు తరలించారు. గన్నవరం స్టోరేజ్ సెంటర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులకి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరిలో మొదటగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ టీకాలు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మొత్తం 3,87,983 మందిని గుర్తించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :