Sunday, January 10, 2021

18 నుంచి రెండు పూటలా బడులు



Read also:

  • 18 నుంచి రెండు పూటలా బడులు
  • పదో తరగతిపై ప్రత్యేక దృష్టి
పాఠశాలల్లో తరగతులను ఈ నెల 18 నుంచి రెండు పూటలా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే విడివిడిగా తరగతులకు మధ్యాహ్న భోజనాన్ని అందించి పాఠశాలను ముగిస్తున్నారు. ఇక నుంచి కరోనాకు ముందు నిర్వహించినట్లే యథావిధిగా బడులను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు.

రాష్ట్రంలో గత నవంబరు 2 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా.. గత డిసెంబరు 14 నుంచి 7, 8 తరగతులను ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత 18 నుంచి ఆరు, ఇంటరు మొదటి ఏడాది తరగతులను ప్రారంభించనున్నారు.

పదో తరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సమాయత్తం చేసేలా బోధన సాగించాలని భావిస్తున్నారు. ఇందుకు జిల్లాల వారీగా 100 రోజుల కార్యాచరణ తయారు చేస్తున్నారు.

1-5 తరగతుల నిర్వహణపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :