Saturday, January 9, 2021

18 నుంచి రెండుపూటలా తరగతులు



Read also:

పదో తరగతి విద్యా ర్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 18 నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు.స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు బోధించే విషయ నిపుణులతో జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.ఆమె మాట్లాడుతూ మేలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్ధులను సమాయత్తం చేసేలా 100 రోజుల కార్యాచరణ తయారీకి నిర్ణయించినట్లు వెల్లడించారు.

జిల్లాలో సుమారు 40 మంది విషయ నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించినట్లు స్పష్టం చేశారు.100 రోజుల ప్రణాళిక అకడమిక్ స్టాండర్డ్స్ ను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని, స్టడీ అవర్ను ఏర్పాటు చేసి మంచి ఫలితాలు రాబట్టే విధంగా ప్రణాళిక ఉండాలని చెప్పారు.

ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ కార్యదర్శి మురళీకృష్ణ మాట్లా డుతూ విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా కనీస స్టడీ మెటీరియల్ తయారు చేయాలని సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :