Friday, December 11, 2020

transfers web options



Read also:

Transfers web options

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తుది అంకానికి చేరింది. బదిలీ కోసం దరఖాస్తు చేసిన తుది సీనియారిటీ జాబితాను గురువారం డీఈవో విడుదల చేశారు. ఈ జాబితాకు పాఠశాల విద్య డైరెక్టర్‌ ఆమోదముద్ర వేయడంతో డీఈవో ప్రకాశం.కో.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఉంచి డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో బదిలీ కోసం 5,624 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. వీరిలో ఒక పాఠశాలలో 8 సంవత్సరా లు పూర్తయి తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1315 మంది, పునర్విభజనలో ప్రస్తుత పని చేస్తున్న పోస్టులు పోయిన వారు 272 మంది, భార్యభర్తలు (స్పౌజ్‌) కేటగీరిలో 686 మంది, ఫ్రి ఫన్షియల్‌ కేటగిరిలో 267 మంది, యూనియన్‌ నాయకులు 9మంది దరఖాస్తు చేశారు. వీరందరికి స్టేషన్‌, సర్వీసు పాయింట్లతో పాటు ప్రత్యేక కేటగిరీ, ప్రిఫన్షియల్‌ కేటగిరీతో కలుపుకుని సీనియారిటీ జాబితాలు విడుదల చేశారు.  

♦ఆప్షన్ల కోసం ఐదు రోజులు

బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పాఠశాలలు ఎంపిక చేసుకొని ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా సెండరీగ్రేడ్‌ టీచర్లు  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు 1,244 మంది, అభ్యర్ధన మేరకు 2249 మంది దరఖాస్తు చేసినందున తాము కో రుకునే పాఠశాలలను ముందుగానే ఎంపిక చేసుకుని ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. 2015 సంవత్సరంలో జరిగిన వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లకు చుక్కలు కనిపించాయి. అందువల్ల ఉపాధ్యాయులు పాఠశాలల ఎంపిక ఆ ప్షన్ల నమోదులో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :