Saturday, December 5, 2020

Sunday story time program



Read also:

Sunday story time program

06-12-2020 నుండి ప్రతి ఆదివారం 3 నుండి 9వ తరగతి విద్యార్థులకు Sunday Story Time ప్రోగ్రాం ప్రారంభం.

05-12-2020 న ప్రధానోపాధ్యాయులు లిబ్రేరియన్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్, వాలంటీర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులతో లైబ్రరీ సందర్శించాలి.

06-12-2020  నుండి లైబ్రేరియన్స్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్, వాలంటీర్స్ Sunday Story Time ప్రోగ్రాం నిర్వహించాలి.

సండే స్టోరీ టైమ్ మార్గదర్శకాలు

👉 రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులకు పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు we love reading అనే పఠన ప్రచారాన్ని పాఠశాల విద్యాశాఖ, ఆం ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది

👉 విద్యార్థులలో మరియు ఉపాధ్యాయులలో కూడా నిరంతర పఠనం అలవాటుగా చేయాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం

👉 పాఠశాల ఆధారిత పఠన కృత్యాలతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరచాలనే ఉద్దేశ్యంతో sunday story time అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడమైనది

👉 లైబ్రరియన్ లతో , గ్రామ సచివాలయానికి చెందిన విద్య & సంక్షేమ సహాయకులు, పఠన వాలంటీర్ల  సహకారాలతో... ప్రతి ఆదివారం పిల్లలు   పబ్లిక్ లైబ్రరీలలో/కాలనీలలో/వీధుల్లో/వార్డులలో సమావేశమై పఠన కృత్యాలను నిర్వహించవలెను

👉 sunday story time కి సంబంధించి పై వారితో ప్రధానోపాధ్యాయులు ఒక సమావేశం ఏర్పాటు చేయాలి

👉 ది.05.12.2020 న పైన పేర్కొనిన వారందరూ పబ్లిక్ లైబ్రరీని మరియు సామూహిక పఠనా కేంద్రాల ప్రాంతాలను గుర్తించి, సందర్శించి...ఉదయం 10 గంటలకు విద్యార్థులను కూడా ఆహ్వానించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సామూహిక పఠనం చేయించాలి

👉 ది.06.12.2020 ఆదివారం పైన పేర్కొనిన వారందరూ కలసి పాఠశాల లైబ్రరీ నుండి CLIL పుస్తకాలు/NBT పుస్తకాలు/CBT పుస్తకాలు ఏదైనా ఒక పుస్తకం ఎంపికచేసి సరిపోవు సంఖ్యలో సేకరించాలి

👉 ది.06.12.2020 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పై వారందరూ కలసి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి

👉 ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు పై వారందరూ కలిసి సామూహిక పఠనా కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరించిన పిదప... విద్యార్థులచే సొంతగా పఠనం చేయించాలి

👉 ఈ సామూహిక పఠన కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు , విద్యావేత్తలు , సీనియర్ సిటిజన్ లు , విద్యార్థుల సేవలను వినియోగించుకోవలెను. వీరిలో ఒకరిని ఆదివారంనకు  పఠన వాలంటీర్ గా వ్యవహరించేలా చూడాలి.

👉 ప్రతి ఆదివారం అన్ని లైబ్రరీలలో , అన్ని అవాస ప్రాంతాలలో 3 నుండి 9 తరగతుల విద్యార్థులను ఆహ్వానించి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి

👉 పై వారందరూ కలసి sunday story time కి ముందురోజున సామూహిక పఠనా  కార్యక్రమం యొక్క సంసిద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి

👉 అందరు తల్లిదండ్రులను , విద్యార్థులను సామూహిక పఠనా కార్యక్రమానికి హాజరయ్యేలా వాట్సాప్/ఫోన్ కాల్/వ్యక్తిగత ఆహ్వానం ల ద్వారా ఆహ్వానించాలి

👉 స్థానికంగా ఆసక్తి గల వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు

👉 సామూహిక పఠనా కార్యక్రమానికి సరిపోవు సంఖ్యలో పుస్తకాలు సిద్ధంగా సేకరించి ఉంచుకోవాలి

👉  ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి

👉 విద్య & సంక్షేమ సహాయకుల సేవలు వినియోగించుకునేందుకు గ్రామ సచివాలయాల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :