Sunday, December 13, 2020

Schools open for 7th class students



Read also:

ఏడో తరగతి విద్యార్థుల బడిబాట
రేపటి నుంచి వారంలో మూడు రోజులు తరగతులు
పనివేళల సమయాల్లో మార్పులు
  • ఏడో తరగతి విద్యా ర్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించిన ప్రభుత్వం దశల వారీగా ఒక్కో తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించిం ది. 
  • ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు, 8,9 తరగ తులకు రోజుమార్చిరోజు తరగతులు నిర్వహిస్తున్నా రు. సోమవారం నుంచి ఈ విధానంలో కూడా మార్పులు చేశారు. 
  • ఇక నుంచి ప్రతిరోజు 9,10 తరగతులకు రెగ్యులర్‌గా తరగతులు నిర్వహిస్తారు. 7,8 తర గతులకు మాత్రం రోజుమార్చిరోజు స్కూళ్లకు హాజరు కావాల్సిఉంది. 
  • సమవారం నుంచి 7వ తరగతి విద్యా ర్థులు పాఠశాలలకు హాజరవుతారు. వీరికి సోమ, బుధ, శుక్రవారాల్లో తరగతులు జరుగుతాయి.
  • 8వ త రగతి విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.
  • పరతి విరామ సంద ర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు  విరామ సమయం కేటాయించారు. అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి. 
  • మధ్యాహ్న భోజనం చేసి వచ్చే సమయంలో కూడా భౌతికదూరం పాటిం చేలా చూడాలి. ఎదురెదురుగా కూర్చొని భోజనం చేయకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పనివేళలు ఇవీ

పరాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పనివేళల్లో ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన తరువాత ఇళ్ళకు వెళ్ళాలి.

ఉపాధ్యాయులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలి.
Covid నేపథ్యంలో తరగతి గదిలో ఉదయం 9.30 నుంచి 9.45 వరకు పార్థన, కొవిడ్‌ ప్రతిజ్ఞ చేయాలి. 

  • ఉదయం 9.45 నుంచి 10.25  వరకు మొదటి పీరియడ్‌
  • 10.25 నుంచి 10.35 వరకు మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం
  • 10.35 నుంచి 11.15 వరకు రెండో పిరియడ్‌
  • 11.15 నుంచి 11.20 వరకు మంచినీటి విరామం
  • 11.20 నుంచి 12.00వరకు మూడవ పిరియడ్‌
  • 12 నుంచి 12.10 వరకు విరామం
  • 12.10 నుంచి 12.50 వరకు పదోతరగతి విద్యార్థు లకు నాల్గవ పిరియడ్‌, 9,7 లేదా 8 తరగతులకు భోజన విరామం 
  • 12.50 నుంచి 1.30వరకు పదోతరగతి విద్యార్థులకు భోజన విరామం, అలాగే 9,7 లేదా 8 తరగతులకు నాల్గవ పిరియడ్‌ జరుగుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :