Thursday, December 17, 2020

ఇండియాలో విడుదలైన Redmi 9 Power



Read also:

ఇండియాలో విడుదలైన Redmi 9 Power-ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే

స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెడ్ మీ9 పవర్(Redmi 9 Power) మొబైల్ ఇండియాలో ఈ రోజు లాంచ్ అయ్యింది. శాంసగ్ గేలాక్సి m11, Vivo Y20, Oppo A53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెడ్ మీ9 పవర్(Redmi 9 Power) మొబైల్ ఇండియాలో ఈ రోజు లాంచ్ అయ్యింది. సాంసగ్ గేలాక్సి m11, Vivo Y20, Oppo A53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకు వచ్చింది. Redmi 9 power ధర 4GB RAM+64GB ధర రూ.10, 999 కాగా, 4GB RAM+128GB మోడల్ కు రూ.11,999గా నిర్ణయించారు. మొత్తం నాలుగు కలర్లలో ఈ మొబైల్ ఉండనుంది. Blazing Blue, Electric Green, Fiery Red, and Mighty Black కలర్లలో అమ్మకానికి ఉంచారు. అమెజాన్, ఎంఐ వెబ్ సైట్లలో ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ నిర్వహించనున్నారు.

స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్ MIUI12 ఆపరేటింగ్ సిస్టెమ్ ను కలిగి ఉంటుంది. 6.53 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటుంది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇంకా మరెన్నో ఫీచర్లు ఈ ఫోన్లో పొందుపరిచారు. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఈ ఫ్రెంట్ కెమెరాలోని సెన్సార్ ఫేస్ అన్ లాక్ కోసం కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని మెమోరీని ఎస్డీ కార్డు ద్వారా 512జీబీ వరకు పొడిగించుకోవచ్చు. కనెక్టివిటీ కోసం 4G VoLTE, dual-band Wi-Fi, Bluetooth v5.0, GPS/ A-GPS, Infrared (IR) blaster, USB Type-C, and a 3.5mm headphone jackలను సైతం ఏర్పాటు చేశారు. 600mAh బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని సైతం అందించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :