Tuesday, December 1, 2020

Power Bank using tips



Read also:

Power Bank using tips-పవర్ బ్యాంక్ వాడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే

స్మార్ట్‌ఫోన్‌తో పాటు పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. మీరు పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? లేదా పవర్ బ్యాంక్ వాడుతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి.

1. పవర్ బ్యాంక్.స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ లేనప్పుడు ఆదుకునే గ్యాడ్జెట్. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పుడో ఒకప్పుడు పవర్ బ్యాంక్ ఉపయోగించి ఉంటారు. ఎక్కువగా జర్నీ చేసేవాళ్లు తప్పనిసరిగా పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్తుంటారు. పవర్ బ్యాంకునే పోర్టబుల్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు.

2. స్మార్ట్‌ఫోన్లు మాత్రమే ట్యాబ్లెట్స్, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్న్స్‌ని ఛార్జ్ చేయొచ్చు. మీరు పవర్ బ్యాంక్ ఉపయోగిస్తున్నట్టైతే ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ ఎంత ఉంటుందో దానికి రెండు రెట్లు పవర్ బ్యాంక్ ఉండేలా చూసుకోండి. 

3. ఉదాహరణకు మీ స్మార్ట్‌ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ తీసుకోవాలి. 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయినా మీకు వచ్చే ఔట్‌పుట్ సుమారు 8,000ఎంఏహెచ్ మాత్రమే. 20 శాతం వరకు ఔట్ పుట్ తక్కువగా వస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి.

4. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలోనే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటోంది. సాంసంగ్ అయితే 7,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇలాంటి ఫోన్లకు 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఒక్కసారి ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నట్టయితే మీకు పవర్ బ్యాంక్ అవసరమే ఉండదు.

5. అయితే ఎక్కువగా జర్నీ చేస్తున్నా, ఛార్జింగ్ అందుబాటులో లేకపోయినా పవర్ బ్యాంక్ కొనొచ్చు. అలాంటప్పుడు 20,000ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవడం మంచిది. ఇంత భారీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకుతో భారీ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను 2 నుంచి 3 సార్లు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు.

6. పవర్ బ్యాంక్ కొనేముందు స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి. ఎంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో చూడాలి. అంతేకాదు... పవర్ బ్యాంక్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు ఎంత ఫాస్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్‌ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి.

7. దీని వల్ల పవర్ బ్యాంక్ ఫుల్ ఉందా? ఎంత శాతం ఛార్జింగ్ అయిపోయింది? అన్న వివరాలు తెలుస్తాయి. పవర్ బ్యాంకులో నాలుగు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఒకే ఎల్ఈడీ లైట్ వెలుగుతుందంటే పవర్ బ్యాంక్ దాదాపుగా ఖాళీ అయినట్టే. పూర్తిగా ఖాళీ కాకముందే పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలి. అన్ని ఎల్ఈడీలు వెలుగుతున్నాయంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టే.

8. పవర్ బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుందన్న అంశం మీరు తీసుకున్న కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉపయోగిస్తే పవర్ బ్యాంక్ త్వరగా ఫుల్ అవుతుంది. 

9. మీరు ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఫాస్ట్ ఛార్జర్‌తో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ రోజూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేయడం మంచిది. 

10. ఛార్జింగ్ సదుపాయం లేనప్పుడే పవర్ బ్యాంక్ ఉపయోగించాలి. ఓ పవర్ బ్యాంకును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు ఉపయోగిస్తే 18 నెలల నుంచి 24 నెలల లైఫ్ ఉంటుంది. రెగ్యులర్‌గా వాడితే మాత్రం ఏడాదికో పవర్ బ్యాంక్ మార్చాల్సిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :