Monday, December 7, 2020

posts block



Read also:

  • తప్పనిసరి బదిలీల సంఖ్యతో సమానంగా బ్లాక్‌చేసిన వైనం
  • బదిలీల్లో సగమే జిల్లాల్లో ప్రదర్శన
  • ఈ ప్రదర్శనలో డీఈవోల ఇష్టారాజ్యం
  • ఒక్కోచోట ఒక్కో తరహా విధానం
  • అన్నీచూపితే మారుమూల స్కూళ్లకుటీచర్లు వెళ్లరంటూ ప్రభుత్వం సమర్థన

బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయలోకానికి పాఠశాల విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను బదిలీల్లో చూపకుండా బ్లాక్‌ చేసింది. నిబంధనలమేరకు తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్ల సంఖ్యకు సమానంగా వేలాది ఖాళీలను బ్లాక్‌లో పెట్టింది. ఫలితంగా కోరుకున్న పాఠశాలకు బదిలీ అయ్యేందుకు ఉపాధ్యాయులకు ఉండే మార్గం మూసుకుపోయింది. పెద్ద స్కూళ్లలో విద్యార్థుల అవసరాలకు తగినంతమంది టీచర్లు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.

రాష్ట్రంలో సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు లేకుండా చర్యలు తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినప్పటికీ, ఖాళీలను బ్లాక్‌చేయడం వల్ల భవిష్యత్తులోనూ ఈ వ్యవస్థే కొనసాగే పరిస్థితి నెలకొంది. ఖాళీలన్నింటినీ చూపినట్లయితే మారుమూలన ఉన్న పాఠశాలలకు ఎవరూ వెళ్లరని, తద్వారా ఆయా స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందని విద్యాశాఖ తన చర్యను సమర్థించుకొంటోంది. విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఖాళీలన్నింటినీ చూపకుండా బ్లాక్‌ చేయాలని ఆదేశించారని చెబుతోంది.

*♦మంచిదే.. కానీ,*

మారుమూలన ఉన్న పాఠశాలలు మూతపడకుండా ఉండాలంటే ఈ నిర్ణయం మంచిదే. అయితే, ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన మార్గదర్శకాలు జిల్లాల్లో అమలుకావడం లేదని చెబుతున్నారు. విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఒక్కో జిల్లాలో ఒక్కో విఽధంగా ఖాళీలను ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. ఖాళీలను బ్లాక్‌ చేసే విషయంలో పైరవీలకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. దొడ్డిదారి బదిలీ కోరుకునే వాళ్లు నగరాలకు, పట్టణాలకు సమీపంలోని ఖాళీలను బ్లాక్‌ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే ఇప్పుడు బ్లాక్‌ చేసిన ప్రదేశాల్లోకి రావచ్చన్న ప్లాన్‌తో కొందరు రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు.
రిక్వెస్ట్‌ బదిలీల సంగతేంటి

బదిలీ నిబంధనల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికీ ప్రాధాన్యం కల్పించారు. అయితే, ఖాళీలను బ్లాక్‌ చేసే నిర్ణయం వారి అవకాశాలను వమ్ము చేస్తుందని చెబుతున్నారు. ఖాళీలను బ్లాక్‌ చేస్తూ బదిలీలు చేపట్టడం వల్ల అసలు బదిలీల ప్రయోజనం ఏమి ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బదిలీల కోసం 75,500 మంది ఉపాధ్యాయులు దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన టీచర్లు 24,600 మంది. మిగిలిన 50,900 మందికి బదిలీ తప్పనిసరికాదు. తప్పనిసరి బదిలీ కావాల్సిన వాళ్లలో .. ఒక ప్రదేశంలో ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఇలా బదిలీ అయ్యేవారితో సమంగా పోస్టులు బ్లాక్‌ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1587 ఎస్‌జీటీ ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎనిమిది సంవత్సరాల ఖాళీలు 743, క్లియర్‌ వేకెన్సీలు 667, రేషనలైజేషన్‌ ఖాళీలు 177 ఉన్నాయి. 1326 ఖాళీలను బ్లాక్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఖాళీలు 2500. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన టీచర్లు 1214 మంది. కాగా 1300 ఖాళీలను ప్రదర్శించి, 1200 ఖాళీలను బ్లాక్‌ చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :