Monday, December 21, 2020

PM kisan status and helpline numbers



Read also:

రైతులకు కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 7వ విడత డబ్బులు ఎప్పుడు తమ ఖాతాల్లో పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 25న ఇందుకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనుంది. అదే రోజు రైతుల సమస్యలపై వారితో చర్చిస్తామని పేర్కొంది. ఏడాదికి ఆరు వేల రూపాయలు ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తున్న కేంద్రం.. మూడు విడతలుగా ఈ మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తోంది. ఇక ఈ మొత్తం తమ ఖాతాల్లో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

  • ఇందుకోసం ముందుగా ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి
  • అందులో Kisan Cornerను క్లిక్ చేయాలి.
  • ఆ తరువాత స్టేటస్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్దిదారులు తమ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • ఆ తరువాత గెట్ రిపోర్ట్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు స్కీన్ మీద కనిపిస్తాయి.
  • ఒకవేళ ఇందుకు సంబంధించిన డబ్బు రాకపోయి.FTO(Fund Transfer Order) అని వచ్చినట్టయితే.
  • లబ్దిదారులు నిరాశ చెందాల్సిన పని లేదు. ఇలా వచ్చినట్టయితే మీరు ఇచ్చిన వివరాలను సరి చూసిందని త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు వేస్తారని అర్థం.
  • మరోవైపు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న అకౌంట్ నంబర్లకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఇస్తే.ఈ డబ్బులు అకౌంట్‌లో పడే అవకాశం ఉంది.
  • అయితే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందలేకపోయిన రైతులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది. 
  • వీటి ద్వారా రైతులు తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చు. 
  • ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606ను ఏర్పాటు చేశారు.
  •  వీటితో పాటు టోల్ ఫ్రీ నంబర్ 18001155266, హెల్ప్ లైన్ నంబర్ 155261, ల్యాండ్ లైన్ నంబర్లు 011—23381092, 23382401, 0120-6025109తో పాటు pmkisan-ict@gov.in ఈ మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయవచ్చ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :