Friday, December 4, 2020

Pention increase from july8



Read also:

జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆసరా పెన్షన్లను రూ.2250 నుంచి రూ.2500కు పెంచుతామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా మరిన్ని పథకాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయించారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అదనంగా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ‘దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని నేను వినియోగించుకుని పేదలకు వీలైనంత మేలు చేస్తున్నానా? లేదా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటా. ఏమైనా తప్పులు చేస్తున్నానా అని ప్రశ్నించుకుంటా. ఈ బృహత్కార్యంలో పేదలకు సాయం చేసేలా అండగా ఉండమని దేవుడ్ని ప్రార్థిస్తా. పేదల కోసం నవరత్నాలు అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల్లో 90 శాతానికి పైగా పూర్తి చేశాం. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు పథకాలతో పాటు పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాం.’ అని సీఎం జగన్ ప్రకటించారు.

ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని, అప్పుడే పింఛన్లు పెంచుతారని, డబ్బులిస్తారని జగన్ విమర్శించారు. తమకు మాత్రం ఎన్నికలు అయిన వెంటనే ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆసరా పెన్షన్లను రూ.2250 నుంచి రూ.2500కు పెంచుతామని ప్రకటించారు. అలా రూ.3000కు పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :