Sunday, December 6, 2020

Manual counseling



Read also:

Manual counseling for SGTS

(SGT)యస్.జి.టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలి - లేకపోతే ఆందోళనలకు సిద్ధం శాసనమండలి ఎన్నికల బరిలో ఏపిటియఫ్ - ఏపిటియఫ్ రాష్ట్ర కమిటి

త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీలు భౌతికంగా జరపాలని, మూసివేసిన ఖాళీలను అన్నింటినీ బదిలీల్లో చూపించాలనీ, ఏపిటియఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమండ్ చేసింది. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో ఏపిటియఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా తీవ్ర నష్టం జరగబోతుందన్న ఆందోళన ఉపాధ్యాయులలో వుందని, అన్ని జిల్లాలలో 50% పైబడి ఖాళీలను మూసివేయడం వలన వారి ఆందోళన మరింత పెరుగుతున్నదని, ఉపాధ్యాయులందరు భయపడే విధంగా బదిలీలు వున్నాయని ఏపిటియఫ్ అభిప్రాయపడింది.

వెబ్ కౌన్సిలింగ్ పై ఉపాధ్యాయ సంఘాలకు నమూన ప్రదర్శన చేసి చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చి నలభై అయిదు రోజులు దాటినా ఇంతవరకు డెమో చూపలేకపోయారని, కాబట్టి ఫిజికల్ గా కౌన్సిలింగ్ మాత్రమే కావాలని ఏపిటియఫ్ కోరుతున్నది.

పై రెండు సమస్యలు పరిష్కారం కాని ఎడల, ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంగా వుండాలని ఏపిటియఫ్ పిలుపునిచ్చింది. తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజక వర్గాలలో అభ్యర్థులను నిలపాలని ఏపిటియఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.భానుమూర్తి, పి.పాండురంగవరప్రసాదరావులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నుపాటి మంజుల, వై.నేతాంజనేయప్రసాద్, బి.జె. మాణిక్యంరాజు, కె.అశోక కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.వెంకటపతిరాజు, ఐ.విజయసారధి, బి.ఎ. సాల్మన్‌రాజు మరియు రాష్ట్ర పూర్వ ప్రధానకార్యదర్శి యన్.పరమేశ్వరరావు పాల్గొన్నారు. 

ఈ క్రింది తీర్మానాలను సబ్ కమిటీ చేసింది 

  • 1. ఉపాధ్యాయుల బదిలీల్లో ఖాళీలను మూసివేయరాదు. 
  • 2. ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను ప్రకటించి, డి.యస్.సి ద్వారా తక్షణం భర్తీ చేయాలి. అప్పటి వరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 
  • 3. ఉపాధ్యాయ బదిలీలను భౌతికంగా (మాన్యువల్ కౌన్సిలింగ్) నిర్వహించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :