Thursday, December 31, 2020

January 2021 Bank Holidays



Read also:

జనవరిలో మీరు చేయాల్సిన బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? వచ్చే నెలలో 10 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడో తెలుసుకోండి.

1. బ్యాంకుల్లో లావాదేవీలు జరిపేవారికి అలర్ట్. జనవరిలో పండుగలు, ఇతర వేడుకల కారణంగా బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాంకుల్లో తరచుగా లావాదేవీలు జరిపేవారు తప్పనిసరిగా ఈ సెలవుల గురించి తెలుసుకోవడం అవసరం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో ముందుగానే ప్రకటిస్తుంది. వచ్చే ఏడాదిలో ఎన్ని సెలవులు ఉంటాయో ముందటి ఏడాదిలోనే ప్రకటిస్తుంది. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. ప్రధాన పండుగల్లో దేశమంతా సెలవులు ఒకేలా ఉంటాయి. కానీ స్థానిక పండుగలకు మాత్రం ప్రాంతాలవారీగా సెలవులు ఉంటాయి.

3. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌‌లో రాష్ట్రాల వారీగా సెలవుల జాబితా ఉంటుంది. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్‌లో ఈ సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. మరి 2021 జనవరిలో బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

4. జనవరిలో బ్యాంకులకు సెలవులు వివరాలు చూస్తే జనవరి 1 న్యూ ఇయర్ డే (శుక్రవారం), జనవరి 14- మకర సంక్రాంతి (గురువారం), జనవరి 26- రిపబ్లిక్ డే (మంగళవారం) సందర్భంగా బ్యాంకులకు సెలవు.

5. దీంతో పాటు జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో ఆదివారం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. ఇక వీటితో పాటు జనవరి 9న రెండో శనివారం, జనవరి 23న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలిడేనే.

6. జనవరిలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు వస్తున్నాయి. అందులో 5 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. వీటితో పాటు న్యూ ఇయర్ డే, మకర సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా సెలవులు వచ్చాయి. బ్యాంకులకు వెళ్లే ముందు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :