Thursday, December 17, 2020

ISRO PSLV C-50



Read also:

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో PSLV C-50 నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా కమ్యూనికేషన్స్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. PSLV C-50 ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సరిగ్గా 3గంటల 41 నిముషాలకు ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సరిగ్గా 20 నిముషాల్లో CMS-01 శాటిలైట్ ను పీఎస్ఎల్వీ సీ-50 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. PSLV – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు 25 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగించిన ఇస్రో ఎట్టకేలకు ప్రయోగగాన్ని పూర్తి చేసింది. స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి PSLV C-50 నింగిలోకి దూసుకెళ్లింది. CMS-01 ద్వారా దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ప‌రిమితి భార‌త్‌తో పాటు అండ‌మాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌కు విస్తరించనుంది.

ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది.. మొత్తం ఏడేళ్ల పాటు కక్షలో తిరగనున్న ఈ శాటిలైట్ బరులు మొత్తం 1410 కిలోలు. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ మోడల్ లో 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది.

PSLV C-50 విజయవంతంగా CMS-01 శాటిటైల్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ K.శివన్ తెలిపారు. నాలుగు రోజుల్లో శాటిలైట్ తన స్థానానికి చేరుకుంటుందన్నారు. 11 ఏల్ల క్రితం ప్రయోగించిన జీశాట్-11కు అనుబంధంగా CMS-01 పనిచేస్తుందని చెప్పారు. శాస్త్రవేత్తలు నిరంతరాయంగా పనిచేయడం వల్ల ఈ ప్రయోగం విజయవంతమైందని శివన్ అన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :