Sunday, December 20, 2020

Intelligence Bureau recruitment 2020



Read also:

IB Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 2 వేల ఉద్యోగాలు.ఇలా దరఖాస్తు చేసుకోండి

Intelligence Bureau recruitment 2020: నిరుద్యోగులకు కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో శుభవార్త చెప్పింది. దాదాపు 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐఓ) పోస్టులను భర్తీ చేయడానికి తాజాగా కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • నిరుద్యోగులకు కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో శుభవార్త చెప్పింది. దాదాపు 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
  • అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐఓ) పోస్టులను భర్తీ చేయడానికి తాజాగా కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టుల్లోజనరల్‌ విభాగంలో 989, ఓబీసీ 417, ఈడబ్ల్యూఎస్‌ 113, ఎస్సీ 360, ఎస్టీ అభ్యర్థులకు 121 కేటాయించారు.
  • డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 27 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ ఈ రోజు(డిసెంబర్19) ప్రారంభమైంది.
  • రాత పరీక్షలో టైర్‌-1, టైర్‌-2 ఉంటాయి. టైర్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ స్టడీస్‌ తదితర సబ్జెక్టుల నుంచి క్వశ్చన్లు అడుగుతారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షను గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • టైర్‌-2లో డిస్క్రిప్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. 50 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షను 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తో పాటు ఏపీలోనూ 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అధికారిక వెబ్‌సైట్‌ www.mha.gov.in or www.ncs.gov.in

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :