Monday, December 14, 2020

Indian Coast Guard Recruitment 2020



Read also:

Indian Coast Guard Recruitment 2020 | కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. డిగ్రీ అర్హతతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 ఖాళీలను ప్రకటించింది. ఇవి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 డిసెంబర్ 21న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 27 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. https://www.joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు ఉంటాయి.

Indian Coast Guard Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే

  • అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ మొత్తం పోస్టులు- 25
  • ఎస్సీ- 5
  • ఎస్టీ- 14
  • ఓబీసీ- 6

Indian Coast Guard Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 21
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 27
  • అడ్మిట్ కార్డ్ విడుదల- 2021 ఫిబ్రవరి 6
  • ప్రిలిమినరీ ఎగ్జామ్- 2021 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20
  • ఫైనల్ సెలక్షన్- 2021 ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏప్రిల్ వరకు

Indian Coast Guard Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే జనరల్ డ్యూటీ పోస్టులకు అర్హులు కాదు.
  • వయస్సు- 1996 జూలై 1 నుంచి 2000 జూన్ 30 మధ్య జన్మించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఎంపిక విధానం- దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేసి ప్రిలిమినరీ సెలక్షన్‌కు పిలుస్తారు.

Indian Coast Guard Recruitment 2020: దరఖాస్తు చేయండి ఇలా

  • అభ్యర్థులు మొదట https://www.joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో opportunities పైన క్లిక్ చేయాలి.
  • Recruitment of Assistant Commandant02/2021 Batch అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవాలి.
  • ఆ తర్వాత Asst. Commandant General Duty (Male) పోస్ట్ సెలెక్ట్ చేయాలి.
  • I Agree బటన్ పైన క్లిక్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని కాపీ భద్రపర్చుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :