Monday, December 21, 2020

Good news for Central Government Pensioners



Read also:

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఊరట లైఫ్‌ సర్టిఫికెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు సమర్పించడానికి గడువు పెంపు

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఊరట లైఫ్‌ సర్టిఫికెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు సమర్పించడానికి గడువు పెంపు/పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది పింఛను పొందేందుకు ఏటా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పింఛను పొందేందుకు ఏటా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు సర్టిఫికెట్లను సమర్పించొచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

80 ఏళ్లకు పైబడి ఉన్న పెన్షనర్ల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక విండోలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే, పింఛనర్ల ఇబ్బందులను తొలగించేందుకు ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలను ఉపయోగించుకుని డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే వెసులుబాటును పింఛన్‌, పింఛనర్ల సంక్షేమ విభాగం కల్పించిందని చెప్పారు. 

దేశవ్యాప్తంగా ఉన్న 1.89 లక్షల పోస్ట్‌మాన్లు, డాక్‌ సేవక్‌లు ఈ సేవలందిస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పింఛన్‌దారులకు గొప్ప ఊరట అని అన్నారు. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ సదుపాయాన్ని ఉపయోగించి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే వెసులుబాటును తీసుకొచ్చే అంశంపై పనిచేస్తున్నామని చెప్పారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :