Thursday, December 3, 2020

Gas booking through whats app process



Read also:

How we can book the gas through whats app

వాట్సాప్ గ్యాస్ బుకింగ్  ఈజీ క్షణాల్లో పని పూర్తిగ్యా్స్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి. 

భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:

భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్‌పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా సులభంగానే క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీని మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది. 

భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:

  • భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344 నెంబర్‌ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 
  • తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. 
  • తర్వాత మీకు రిప్లే వస్తుంది. 
  • తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
  • ఇండెన్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:
  • మీరు ఇండెన్ గ్యాస్ వాడితే.. 7588888824 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. 
  • తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. 
  • ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. 
  • క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది.

HP గ్యాస్ బుకింగ్ చేసే విధానం:

  • హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు 9222201122 నెంబర్ ద్వారా వాట్సాప్‌లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 
  • ఇకపోతే వాట్సాప్ ప్రొఫైల్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు ఉంటాయి. 
  • వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :