Monday, December 14, 2020

FAFTO discussions



Read also:

FAFTO discussions

మిత్రులారా ఫ్యాప్టో ఉద్యమ కార్యాచరణలో భాగంగా 16వ తేదీ చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం విషయం మీ అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ దేవా నంద రెడ్డి గారు ఉద్యమ తీవ్రత దృష్ట్యా ఫ్యాప్టో నాయకత్వాన్ని మంగళగిరి నందలి తన కార్యాలయానికి పిలిపించుకొని చర్చలు జరపడం జరిగింది.

ఈ చర్చలలో బ్లాక్ చేయడంలో లో 8 సంవత్సరాల  లాంగ్  స్టాండింగ్ ఖాళీలను కూడా పరిగణలోనికి తీసుకుని బ్లాక్ చేయడం వల్ల అన్ని జిల్లాలలో 50 శాతానికి మించి పోయిన విషయాన్ని వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది.

జరిగిన పొరపాటును గ్రహించారు బ్లాక్ చేయకుండా కౌన్సిలింగ్ ఖాళీలు అనుమతించాలని ఒకవేళ బ్లాక్ చేయవలసి వస్తే పది శాతానికి మించకుండా 20 మంది పిల్లలకు తక్కువ ఉన్న పాఠశాలల్లో బ్లాక్ చేసేటట్లు చూడాలని అలాగే ఎస్ జి టి లకు ప్రత్యక్ష పద్ధతిలో కౌన్సిలింగ్ నిర్వహించాలని జిల్లా కేంద్రంలో వీలుకాకపోతే డివిజన్ కేంద్రాల లో  లో ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉద్యమ నాయకుల పై ఛార్జి మెమోలు అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరడం జరిగింది.

ఈ విషయాన్ని  లోమంత్రిగారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ సాయంత్రం లోగా ఏ విషయము చెప్తామని చెప్పారు మనం ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు పూర్తి సన్నద్ధత కావాల్సిందిగా కోరుతున్నాం-జి. హృదయరాజు అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి  మరియు కో చైర్మన్ ఫ్యాప్టో

టీచర్స్ ట్రాన్సఫర్స్ కి సంబదించిన పూర్తి సమాచారం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :