Friday, December 11, 2020

DSC TET in December



Read also:

త్వ‌ర‌లో డీఎస్సీ-బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి విద్యాశాఖ క‌స‌ర‌త్తు

డిసెంబర్‌లోనే టెట్‌

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో డీఎస్సీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో సుమారు 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

డిసెంబర్‌లోనే టెట్‌

ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌) నిర్వ‌హ‌ణ‌కు కూడా అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అనుమతి కోసం ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు పంపారు. ఈసారి పాఠ్య ప్ర‌ణాళిక‌లో మార్పులు చేయ‌నున్నారు. ఈ బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర విద్య ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ మండ‌లి(ఎన్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది. ప్ర‌భుత్వం ఇంగ్లిష్‌ మీడియం ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తున్నందున అభ్య‌ర్థులను ప‌రీక్షించేందుకు టెట్‌లో ఇంగ్లిష్‌ మీడియం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు ఇచ్చే అవ‌కాశం ఉంది. డిసెంబ‌రులోనే టెట్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే టెట్ నిర్వ‌హించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :