Saturday, December 12, 2020

Check payment Rules from January



Read also:

బ్యాంకింగ్ ఫ్రాడ్‌లను నివారించేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జనవరి 1వ తేదీ నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బ్యాంకులకు ఆర్‌బీఐ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విధానం కింద రూ.50వేలు అంతకన్నా ఎక్కువ మొత్తం విలువ కలిగిన చెక్కులకు పేమెంట్లు చేసేటప్పుడు బ్యాంక్ సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు.

చెక్కులను ఇచ్చే వారి నుంచి ఎస్ఎంఎస్‌, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులు ఆ చెక్కులకు సంబంధించిన వివరాలను సేకరిస్తాయి. అంటే.. చెక్కుపై వేసిన తేదీ, బెనిఫిషియరీ పేరు, చెల్లించాల్సిన మొత్తం వివరాలు తదితర సమాచారాన్ని బ్యాంకులు తీసుకుని బెనిఫిషియరీలకు చెల్లింపులు జరిపే సమయంలో సీటీఎస్ ద్వారా ఆ వివరాలను మరొకసారి క్రాస్ చెక్ చేస్తారు.దీంతో మోసాలకు ఆస్కారం ఉండదు.

అయితే రూ.50వేలు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని ఆర్‌బీఐ చెప్పినా బ్యాంకులు మాత్రం రూ.5 లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగిన చెక్కులనే ఈ విధానం ద్వారా క్రాస్ చెక్ చేయాలని చూస్తున్నాయి. అయినప్పటికీ ఈ విధానాన్ని ఎంచుకోవడం అనేది పూర్తిగా కస్టమర్ ఇష్టం అని, ఆ నిర్ణయాన్ని కస్టమర్లకే వదిలేస్తామని, కస్టమర్లు కోరితే ఈ విధానం కింద చెక్కులను క్రాస్ చేస్తామని.బ్యాంకులు తెలిపాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
Gupta SVSLN
AUTHOR
December 12, 2020 at 10:04 PM delete

Chala easy way lo vunnayi. Anni information bagunnayi

Reply
avatar