Thursday, December 3, 2020

Central clarity about 2000note ban



Read also:

Central clarity about 2000note ban

రూ. 2000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సరఫరా చేయడం లేదనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

రెండు వేల రూపాయల నోటును కేంద్రం రద్దు చేయబోతోందనే వార్త గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. రూ. 2000 నోటును ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకులకు సరఫరా చేయడం పూర్తిగా నిలిపేసిందన్నది ఆ వార్త సారాంశం. ఈ కారణంగానే చాలా బ్యాంకు ఏటీఎంలలో కేవలం వంద, రెండు, ఐదు వందల రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయని ఆ వార్త పేర్కొంది. అంతేకాదు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు తమ ఏటీఎంలలో రూ. 2000 నోటును అమర్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాయని ఈ వార్తలో ఉంది. దీంతో చాలామంది దీనిపై ఆందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరహాలోనే.. కేంద్రం మరోసారి రూ. 2000 నోటును రద్దు చేయనుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఈ వార్తపై కేంద్రం వివరణ ఇచ్చింది. బ్యాంకులకు ఆర్‌బీఐ రూ. 2000 నోటు సరఫరా నిలిపి వేయలేదని వివరించింది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది.

కొద్దిరోజుల క్రితం కొన్ని బ్యాంకులు రూ. 2000 నోటు సరఫరా నిలిపేశాయనే వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా స్పందించారు. అసలు తాము బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల జారీని నిలిపివేయాలంటూ బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. ఎప్పటిలాగే రూ.2,000 నోట్లు చట్టబద్ధంగా చలామణిలో ఉంటాయని, పెద్ద నోట్ల విషయంలో పుకార్లు నమ్మొద్దని స్ఫష్టం చేశారు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :